ఇండస్ట్రీలో వన్నె తరగని అందం మెయింటైన్ చేస్తున్న హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉంటారు. కెరీర్ ప్రారంభించి ఎన్నేళ్ళైనా వారి అందం మాత్రం రోజురోజుకూ రెట్టింపు అవుతుందేమో అనిపిస్తుంది. ఆ రేంజ్ లో గ్లామర్ ని చేస్తూ.. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటారు హీరోయిన్స్. అలాంటి ఆల్ టైం అందగత్తెలలో ఒకరు త్రిష.
ఇండస్ట్రీలో నటిగా అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈ చెన్నై బ్యూటీ.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. అలాగే తమిళ స్టార్స్ తో తెలుగులో మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, ప్రభాస్, గోపీచంద్, బాలకృష్ణ.. ఇలా అందరి సరసన సినిమాలు చేసి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
కెరీర్ ప్రారంభం నుండే గ్లామరస్ రోల్స్ చేసి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న త్రిష.. తన గ్లామర్ తో తెలుగు, తమిళ ఇండస్ట్రీలను కొన్నేళ్లపాటు ఓ ఊపు ఊపేసింది. అయితే.. కొన్నేళ్లుగా గ్లామరస్ రోల్స్ కి దూరంగా ఉంటూ నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటోంది. ఈ క్రమంలో విజయ్ సేతుపతి సరసన '96' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఇక ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్' మూవీలో కీలకపాత్ర పోషించింది. సెప్టెంబర్ 30న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది పొన్నియన్ సెల్వన్. ఈ క్రమంలో రిలీజ్ దగ్గరపడే సరికి చిత్రబృందం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపింది. ఈ వేడుకలో పొన్నియన్ సెల్వన్ టీమ్ అంతా పాల్గొంది.
అయినప్పటికీ, బ్లాక్ సారీలో మతులు పోగొడుతూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది త్రిష. ఈ ఈవెంట్ మొత్తంలో త్రిష.. తన వన్నె తరగని గ్లామర్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ మధ్య త్రిష తెలుగులో సినిమాలు చేయనప్పటికీ, ఆమెకు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ భీభత్సంగా ఉన్న సంగతి తెలిసిందే.
తెలుగులో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, స్టాలిన్, సైనికుడు, బుజ్జిగాడు, కింగ్, శంఖం, నమో వెంకటేశా, బాడీగార్డ్, దమ్ము, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, కృష్ణ లాంటి హిట్ సినిమాలు చేసిన త్రిష.. చివరిసారిగా నటసింహం బాలయ్య సరసన `లయన్` సినిమాలో మెరిసింది. అప్పటినుండి తెలుగులో సినిమాలు చేయలేదు త్రిష.
ఇక చాలాకాలం తర్వాత తెలుగు స్టేట్స్ లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవడంతో ఫ్యాన్స్ కేరింతలతో ఆహ్వానం పలికారు. ప్రస్తుతం అమ్మడి వయసు 39 సంవత్సరాలు. పైగా గ్లామర్ రోల్స్ కూడా చేయట్లేదు. అయినా.. ఇంతందం ఎలా అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్, నెటిజన్స్. దీంతో త్రిషను చూసి.. ఇంతందం దారి మళ్లిందా..' అంటూ మనసులో కుర్రకారంతా ఓ సాంగ్ పాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. త్రిష హీరోయిన్ గా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా.. తమిళంలో చాలా బిజీ అయిపోయింది. పొన్నియన్ సెల్వన్ కాకుండా త్రిష చేతిలో మరో నాలుగు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే ఫ్యాన్స్ కి ఏదైనా గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి. మరి త్రిష గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.