సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, కన్నడ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘పెళ్లిసందD’. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల..తొలి సినిమాతోనే కుర్రకారును ఆకట్టుకుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తొలిసారిగా ఈ చిత్రంలో నటించారు. ఆయన శిష్యురాలు గౌరి రోనంకి తెరకెక్కించిన ఈ చిత్రం 2021 అక్టోబర్ లో థియేటర్ల విడుదలై.. మంచి టాక్ సొంతం చేసుకుంది. సాధారణంగా ప్రస్తుతం ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన రెండు నెలల లోపు, మహా అయితే నాలుగు నెలలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే పెళ్లి సందD మూవీ మాత్రం మిగిలిన సినిమాలకు భిన్నంగా ఓటీటీ విడుదలకు చాలా సమయం తీసుకుంది. ఎప్పుడేప్పుడు బుల్లితెరపై ఈ సినిమా చూద్దామనుకునే అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు ఓ శుభవార్త తెలిసింది.
పెళ్లి సందD సినిమా ఓటీటీలో విడుదల తేదీ ఖరారైంది. జూన్ 24న ‘జీ5’ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ వార్తను జీ5 సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ట్విట్టర్ లో ఓ వీడియోను విడుదల చేస్తూ.. “పెళ్లి సందD చేయడానికి రెడీనా? మా సినిమా రెడీ! ముహూర్తం:జూన్ 24, అందరూ ఆహ్వానితులే” అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ సినిమా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ వస్తోన్న అభిమానులు ఈ వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
పెల్లి సందD చేయడానికి రెడీనా??
మా సినిమా రేడీ!
ముహుర్తం: 24 జూన్
అందరూ ఆహ్వానితులే#PelliSandaDonZEE5 #PelliSandaD@Ragavendraraoba @mmkeeravaani @arkamediaworks @Shobu_ @boselyricist pic.twitter.com/17nMnoTzD6— ZEE5 Telugu (@ZEE5Telugu) June 21, 2022