తెలుగులో ఈమె చేసింది ఒక్కటే సినిమా. అది కూడా జనాల్ని అంతంత మాత్రంగానే ఎంటర్ టైన్ చేసింది. కానీ ఈ బ్యూటీకి మాత్రం చాలా క్రేజ్ వచ్చింది. కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. చిన్నప్పుడు ముద్దుముద్దుగా ఎంత క్యూట్ గా ఉందో.. ఇప్పుడు అంతకంటే రెట్టింపు అందంగా తయారైంది. చీర లేదా మోడ్రన్ డ్రస్ ఏది కట్టుకున్నా సరే మిగతా హీరోయిన్లు అందరూ కూడా కుళ్లుకుని చస్తారేమో. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది మరి. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో పాటు ఓ పాన్ ఇండియా మూవీలోనూ హీరోయిన్ గా చేస్తోంది. ఈమెని ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో ముద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నారి హీరోయిన్ శ్రీలీల. అమెరికాలో సెటిలైన తెలుగు ఫ్యామిలీలో పుట్టిన ఈమె.. బెంగళూరులో పెరిగింది. చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్న ఈమె.. పలు స్టేజీ ఫెర్ఫామెన్సులు కూడా ఇచ్చింది. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. ఇక 2021లో MBBS పూర్తి చేసిన ఈమె.. అంతకంటే రెండు సంవత్సరాల ముందే అంటే 2019లో ‘కిస్’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా మారింది. అదే ఏడాది ‘భారతే’ సినిమాలోనూ హీరోయిన్ గా చేసింది.
ఇక ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్వవేక్షణలో తీసిన ‘పెళ్లి సందD’లో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. శ్రీలీలకు మాత్రం ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’లో హీరోయిన్ గా ఛాన్సు వచ్చింది. ఇక యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ‘అనగఅనగా ఓ రాజు’లోనూ శ్రీలీలనే హీరోయిన్ గా చేస్తోంది. మరోవైపు గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’. పాన్ ఇండియా రేంజులో తీస్తున్న ఈ చిత్రంలోనూ శ్రీలల ఓ కథానాయికగా చేస్తోంది.