తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాషలకు సంబంధించిన హీరోయిన్లు ఎంతో మంది దర్శనమిచ్చారు. అందులో కొద్ది మంది మాత్రమే సక్సెస్ బాటలో నడిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కొంతమంది హీరోయిన్లు ఎంత స్కీన్ షో చేసినా, గ్లామర్ పాత్రల్లో రెచ్చిపోయినా.. సరైన సక్సెస్ మాత్రం అందుకోలేపోయారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు.. కానీ అతి కొద్ది మందే సక్సెస్ సాధించారు. కొంతమంది హీరోయిన్లు ఎంత గ్లామర్ షో చేసినా సరైన గుర్తింపు మాత్రం తెచ్చుకోలేపోతుంటారు. అలాంటి హీరోయిన్లలో ఒకరు పాయల్ రాజ్ పూత్. మొదటి సినిమా నెగిటీవ్ రోల్ లో చేసినా తన స్కిన్ షోతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. వెండితెరపై పెద్దగా సక్సెస్ సాధించకున్నా.. తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో నటిజన్లను బాగా ఆకర్షిస్తుంది. తాజాగా ఈ అమ్మడు స్పోర్ట్స్ బ్రాలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మోడలింగ్ లో రాణిస్తున్న పాయల్ రాజ్ పూత్ పంజాబీలో హీరోయిన్ గా చాన్సు దక్కించుకుంది. తక్కువ సమయంలోనే అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు దెచ్చుకుంది. పంజాబీలో వరుస సినిమాల్లో నటిస్తున్నా ఈ అమ్మడికి ఆర్ఎక్స్ 100 తెలుగు మూవీలో ఛాన్స్ దొరికింది. ఈ మూవీలో లిప్ లాక్, స్కీన్ షో తో రెచ్చిపోయి నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడంతో పాయల్ కి వరుస ఛాన్సులు వస్తాయని భావించారు.. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్ గా పెద్దగా చాన్సులు రాకున్నా.. ఆర్డీఎక్స్ లవ్, వెంకిమామ, డిస్కో రాజా లాంటి చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడు ఐటమ్ సాంగ్ లో కూడా నటిస్తుంది.
హిట్టు, ఫ్లాపు అనే ఫలితాలతో సంబంధం లేకుండా తనకు వచ్చిన ప్రతి పాత్రలో నటిస్తూ వెళ్తుంది పాయల్ రాజ్‌పుత్. ఆ మద్య ఆది నటించిన తీస్ మార్ ఖాన్, మంచు విష్ణు నటించిన జిన్నా చిత్రాల్లో నటించినా అవి కూడా పెద్ద సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇక అనగనగా ఓ అతిధి, త్రీ రోజెస్ అనే ఓటీటీ వెబ్ సీరీస్ లో నటించింది. ప్రస్తుతం తెలుగు లో ఫోకస్ చేస్తూనే తమిళంలో వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది. పాయల్ రాజ్ పూత్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటూ తన ఫోటోలు, వీడియోలతో పాటు పర్సనల్ లైఫ్ విషయాలు, కెరీర్ విషయాల గురించి ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. దీంతో ఈ అమ్మడు రెట్టింపు క్రేజ్ సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్ స్పోర్ట్స్ బ్రా, ట్రాక్ వేసుకొని హాట్ లుక్ తో సందడి చేసింది. టాప్ యాంగిల్ క్లివేజ్ షో చేస్తూ కుర్రాళ్ల మనసు గిలిగింతలు పెడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.