పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ట్రెండ్ సెట్టర్ సినిమాలలో ‘ఖుషి’ ఒకటి. 2001లో విడుదలైన ఈ సినిమా ఎవర్ గ్రీన్ రొమాంటిక్ మూవీగా ఫేమ్ తెచ్చుకొని ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ కి ఒక్కసారిగా ఊహించని స్టార్డమ్ తీసుకొచ్చిన ఈ సినిమా.. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసేసింది. ఇన్నేళ్ళైనా యూత్ కి ఆల్ టైమ్ ఫేవరేట్ గా ఖుషి నిలిచింది. అయితే.. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా.. అన్ని విధాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్, భూమికల మధ్య కెమిస్ట్రీ.. ఇంటర్వెల్ రొమాంటిక్ సీన్స్ కి ఎవర్ గ్రీన్ క్రేజ్, ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
దర్శకుడు ఎస్.జే సూర్య రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీని.. ఆల్ టైమ్ సూపర్ హిట్ మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఈ సినిమాని శ్రీ సూర్య ఫిలిమ్స్ బ్యానర్ పై ఏ. ఎం. రత్నం నిర్మించారు. 2001లో ఏప్రిల్ 27న ఖుషి విడుదలై.. థియేటర్స్ లో ట్రెండ్ సెట్టింగ్ విజయాన్ని నమోదు చేసింది. కాగా.. సినిమాలో ప్రతి సీన్, ప్రతి సాంగ్.. కామెడీ సీక్వెన్స్ లతో పాటు డైలాగ్స్ కూడా ఎంతో పాపులర్ అయ్యాయి. అయితే.. అదే ఖుషి మ్యాజిక్ ని మరోసారి థియేటర్స్ లో ఎంజాయ్ చేయండంటూ.. పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత ఏ.ఎం రత్నం. తాజాగా ఓ ట్వీట్ ద్వారా ఖుషిని థియేటర్స్ లో రీరిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ మధ్యకాలంలో అభిమాన హీరోల బర్త్ డేలు లేదా సినిమా రిలీజై ఇన్నాళ్లయింది అంటూ ఫేవరేట్ సినిమాలను థియేటర్స్ లో రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ ని ఫాలో అవుతూ.. ఖుషి నిర్మాత ఈ సినిమాని డిసెంబర్ 31న న్యూ సెలబ్రేషన్స్ ని మరింత గ్రాండ్ గా జరుపుకోవాలంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పిలుపునిచ్చారు. ఎవర్ గ్రీన్ లవ్ సాగా.. బ్లాక్ బస్టర్ ఫర్ ఏజెస్ అనే లైన్ తో ఖుషి రిలీజ్ పోస్టర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇదే నిర్మాత ప్రస్తుతం పవన్ తో ‘హరిహర వీరమల్లు’ మూవీ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఖుషి సినిమా రీరిలీజ్ అని తెలిసి పవన్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఖుషి సినిమా పవన్ ఫ్యాన్స్ కే కాకుండా కామన్ ఆడియెన్స్ కి కూడా ఫేవరేట్ మూవీగా కొనసాగుతోంది. మరి చూడాలి.. డిసెంబర్ 31ని ఖుషి మూవీతో ఫ్యాన్స్ థియేటర్స్ లో ఎలా రచ్చ చేస్తారో!
A Blockbuster for Ages, An OG Love Saga. Re-live Evergreen Romance 😍
Enjoy once again the ever-lasting Magic of love #Kushi, from 31 Dec in theatres near you! ✨ #KushiReRelease @PawanKalyan @iam_SJSuryah @bhumikachawlat @pcsreeram #ManiSharma @AMRathnamOfl pic.twitter.com/r4RegzdkCD
— Mega Surya Production (@MegaSuryaProd) December 19, 2022