Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. రాజకీయాలతో ఎంత బిజీగా ఉంటున్నా.. సినిమాలను మాత్రం నిర్లక్ష్యం చేయటం లేదు. ఇటు అభిమానుల్ని, అటు వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయటానికి చూస్తున్నారు. అందుకే వరుసగా సినిమాలను లైన్లో పెట్టారు. పవర్ స్టార్ ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు ఇంకో సినిమా పట్టాలెక్కింది. పవన్ ఓ తమిళ రీమేక్‌లో నటించటానికి ఒకే చెప్పారు. సముద్ర ఖని దర్శకత్వంలో 2021లో వచ్చిన ‘వినోదయ సితం’ అనే తమిళ సినిమా రీమేక్‌లో పవన్ నటించబోతున్నారు.
ఈ సినిమాలో పవన్‌తో పాటు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. మరోసారి దేవుడిగా పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. గతంలో ఆయన ‘గోపాల గోపాల’ సినిమాలో కృష్ణుడిగా నటించి అందర్నీ మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక, ఈ రిమేక్‌కు కూడా సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ జులై రెండవ వారంనుంచి ప్రారంభం కానుంది. మరి, ‘వినోదయ సితం’ రీమేక్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Unstoppable Season 2: బాలక్రిష్ణ ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2 మొదటి గెస్ట్‌గా మెగస్టార్ చిరంజీవి