Pawan Kalyan: న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. ఎక్స్ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజిమ్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘అంటే! సుందరానికి’. ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9న జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. ప్రస్తుతం #PKforSundar ట్విటర్లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇటు పవన్ కల్యాణ్ ప్యాన్స్, అటు నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నాని సినిమా ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ రావటం ఇదే మొదటి సారి కావటంతో ఇద్దరి ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ ఒకే వేధికపైకి తీసుకొచ్చిన ఘనత ఏపీలో టిక్కెట్ల ధరల తగ్గింపు వివాదానికే చెందుతుందని అభిమానులు అభిప్రాయాపడుతున్నారు.
గతంలో ఏపీలో టిక్కెట్ల ధరలపై పవన్ కల్యాణ్, నాని ఏపీ ప్రభుత్వంతో నేరుగా పోరాడిన సంగతి తెలిసిందే. నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమాను ఓటీటీకి ఇవ్వటంపై థియేటర్స్ ఓనర్స్ తప్పుబట్టారు. ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నానిపై థియేటర్స్ ఓనర్స్ మండిపాటుపై ‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ స్పందించారు. నానిని అనవసరంగా తిడుతున్నారంటూ బాధపడ్డారు. నానికి తన మద్దతును తెలియజేశారు. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా టైంలో టిక్కెట్ల తగ్గింపుపై పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటానికి నాని పబ్లిక్‌గా మద్దతు పలికారు. ఏపీ ప్రభుత్వానికి తనదైన శైలిలో విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో హాళ్లపై కొన్ని ప్రత్యేక ఆంక్షలు కూడా విధించింది ప్రభుత్వం. ఈ వివాదమే వీరిద్దరి మధ్యా బంధాన్ని బలపడేలా చేసి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.
నాని తాజా సినిమాకు తన మద్దతు తెలిపేందుకు పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ‘అంటే! సుందరానికి’ సినిమాను తెరకెక్కించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లోనే పవన్ ఓ సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్’ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు ప్రొడక్షన్ మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి.. పవన్ రావటానికి అదే కారణం.. లేదా అది కూడా ఓ కారణం అయ్యుండే అవకాశం ఉందని ఓ వర్గం అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి తమకిష్టమైన ఇద్దరు స్టార్ హీరోలను ఒకే వేధికపై చూడటం కన్నుల పండుగా ఉంటుందని ఇద్దరి ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. మరి, నాని సినిమా ఈవెంట్‌కు పవన్ హాజరవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pawan kalyan for Sundar prasad ♥️
Thank you sir @PawanKalyan .#AnteSundaraniki team and I are thrilled 🙏🏼
Looking forward to the pre release event on 9th :))— Nani (@NameisNani) June 7, 2022
ఇవి కూడా చదవండి : Nazriya: మన పిల్లలకైనా ఆ విషయంలో సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్