Pawan Kalyan: కృష్ణంరాజు భౌతికకాయాన్ని కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసానికి తీసుకువచ్చారు. ఒక్కొక్కరిగా సినీ ప్రముఖులు కృష్ణంరాజు నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. కృష్ణంరాజు కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన భౌతికదేహానికి నివాళులు అర్పించారు. ప్రభాస్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓ ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబుతో పవన్ ముచ్చటించారు. ఆయన పక్కన కూర్చొని ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు, పవన్ భుజంపై తట్టి మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, గతకొద్దిరోజులు కృష్ణంరాజు ఊపిరితిత్తుల సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉదయం 11-12 గంటల సమయంలో ఆయన పార్థివ దేహాన్ని నివాసానికి తీసుకువచ్చారు. ప్రముఖుల దర్శనార్థం ఉంచారు. మరికొద్ది సేపట్లో వేరే చోటుకు తరలించనున్నారు. అక్కడ సాధారణ ప్రజలు, అభిమానుల దర్శనార్థం ఉంచనున్నారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. మరి, పవన్ కల్యాణ్, మంచు మోహన్ బాబు కలయికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఎప్పుడూ మీడియా ముందుకి రాని వడ్డే నవీన్.. కృష్ణంరాజు చివరి చూపుకు!