ప్రముఖ బహుభాషా నటుడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. 3వ తేదీ ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె ప్రముఖ రంగస్థల నటుడు బచ్చు సంపత్ భార్య...
ప్రముఖ బహుభాషా నటుడు పరేశ్ రావల్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పరేశ్ భార్య స్వరూప్ సంపత్ రావల్ తల్లి డాక్టర్ మృదులా సంపత్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె 92 ఏళ్ల వయసులో చనిపోయారు. 3వ తేదీన ఆమె చనిపోగా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృదులా ప్రముఖ రంగస్థల నటుడు బచ్చు సంపత్ భార్య. మృదుల 1931 సెప్టెంబర్ 8న జన్మించారు. ఆమె ఓ ప్రముఖ డాక్టర్ కూడా. ఆమె గత కొన్ని నెలలుగా వృధ్యాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముంబైలోని ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పరేశ్ భార్య స్వరూప్ రావల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ఇక, పరేశ్ హిందీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేశారు. క్షణ క్షణం, మనీ, గోవింద గోవింద, మనీ మనీ, రిక్షావోడు, బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబీబీఎస్, తీన్‌మార్ సినిమాలు చేశారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించారు. తన విభిన్నమైన నటనతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో సినిమా చేయటం లేదు. కొన్ని నెలల క్రితం తమిళ సూపర్ హిట్ సినిమా ‘ ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో విలన్ పాత్ర చేసి మరోసారి ఓరా అనిపించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పలు హిందీ సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.