movie news : ప్రముఖ థాయ్ నటుడు బీమ్ పపన్‌గోర్న్ లర్కలీమ్‌పోతే కన్నుమూశాడు. 25 ఏళ్ల వయసులో మార్చి 23న తన నివాసంలో తుది శ్వాస విడిచాడు. 23వ తేదీన వేళకాని వేళ అతడు నిద్రపోతుండగా తల్లి నిద్రలేపటానికి వెళ్లింది. అతడ్ని ఎంత కదిపినా స్పందన రాలేదు. కొద్దిసేపటి తర్వాత బీమ్ ఊపిరి తీసుకోకపోవటం ఆమె గుర్తించింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.
అతడు ఎలా చనిపోయాడన్న దానిపై క్లారిటీ రావటం లేదు. కుటుంబసభ్యులు అతడెలా మరణించాడనేది తెలుసుకోవటానికి పోస్టుమార్టం నిర్వహించవల్సిందిగా వైద్యులను కోరారు. పోస్టుమార్టం వివరాలు రావటానికి మరికొంత సమయం పడుతుంది. అతిచిన్న వయసులో బీమ్ చనిపోవటంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
కాగా, 1996 ఆగస్టు 21న పుట్టిన బీమ్ 6 ఏళ్ల వయసునుంచే థైక్వాండో నేర్చుకోవటం ప్రారంభించాడు. 2015లో యాక్టింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. ‘ది స్టాండర్డ్’ సిరీస్‌లో కీలక పాత్ర పోషించాడు. ప్రాజెక్ట్ ఎస్, వాటర్ బాయ్, మనిల, పిలిప్ఫిన్స్ వంటి చిత్రాలో నటించాడు.
ఇవి కూడా చదవండి : చిత్ర పరిశ్రమలో మరో జంట బ్రేకప్?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.