మాలీవుడ్ నుంచి ఎంతో మంది హీరోయిన్లు తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో కేరళా కుట్టి నిత్యామీనన్ ఒకరు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘అలా మొదలైంది’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ ముద్దుగుమ్మ నిత్యామీనన్. నటించింది కొద్ది సినిమాలే అయినా.. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. హీరోయిన్ గానే కాకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రల్లో అయినా అద్భుతంగా నటిస్తుంది. మాలీవుడ్ లోనే కాదు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించింది.
తెలుగులో ‘అలా మొదలైంది’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిత్యా మీనన్ కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తనకు ఎన్నో ఛేదు అనుభవాలు ఎదుయ్యాయని.. ముఖ్యంగా హీరో ప్రభాస్ ఇష్యూ తనను ఎంతోగానే బాధపెట్టినట్టు తెలిపింది. అప్పట్లో ఆ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద రగడ కూడా చేశారు. అసలు ప్రభాస్ విషయంలో ఏం జరిగింది..? ఎందుకు నిత్యా మీనన్ అంతగా బాధపడింది.. అన్న విషయంపై ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో నిత్యా మీనన్ మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు భాష సరిగా వచ్చేది కాదు.. సాధారణంగా నేను సినిమాలు ఎక్కువ చూడను.. కన్నడ, మళియాళ సినిమాలు కూడా తక్కువే చూసేదాన్ని.. నాకు తెలుగు రాదు కనుక టాలీవుడ్ చిత్రాలు అసలు చూసేదాన్ని కాదు.. అప్పట్లో టాలీవుడ్ లో నాకు తెలిసిన హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్. తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓ సందర్భంలో నన్ను మీకు ప్రభాస్ తెలుసా అని ప్రశ్నించారు.. వాస్తవంగా నాకు ప్రభాస్ పెద్దగా తెలియదు. దాంతో ఎవరు? తెలియదు? అని సమాధానం ఇచ్చాను.
అప్పుడు నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నేను ఎదో పెద్ద తప్పు చేసినట్లు వార్త క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఆ విషయాన్ని పెద్దది చేశారు. అన్నీ తెలిసి కూడా నా గురించి అలా రాయడంతో చాలా హర్ట్ అయ్యాను.. ఆ న్యూస్ తో ఇండస్ట్రీలో నాకు పెద్ద తగిలింది. అప్పట్లో ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బాగా ట్రోల్ చేశారు.. వ్యతిరేకించారు. ఆ విషయం తల్చుకొని నేను ఇప్పటికీ బాధపడుతుంటాను’ ఆవేదన వ్యక్తం చేసింది నిత్యామీనన్. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.
Nithya Menon: Naku Telugu lo Chiranjeevi, AlluArjun, venkatesh Telusu
Prabhas evaro appudu Naku Thelidhu
Before Baahubali Telugu States lone Prabhas Thelidhu Nithya Menon ki ela thelusthadhi le 🤣🤣 pic.twitter.com/6Y78dZJ0Y2— JuLaYi ᴬᴬ🪓 (@JuLaYiAADHF) November 18, 2022