హ్యాపీడేస్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నిఖిల్ సిద్ధార్థ.. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్నాడు. కామెడీ సినిమాలు చేస్తూ అటు తనలో సీరియస్ నటుడు కూడా ఉన్నాడంటూ నిరూపించుకున్నాడు. సూపర్ సక్సెస్ అయిన కార్తికేయ్ సినిమాకి సీక్వెల్‌గా కార్తికేయ-2 తీసి సీక్వెల్‌తో హిట్టు కొట్టిన కొద్ది మంది హీరోల లిస్ట్ నిఖిల్ చేరిపోయాడు. ప్రస్తుతం కార్తికేయ-2 సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు స్పై జానర్‌లో ఓ థ్రిల్లర్ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి.
సోషల్ మీడియా ప్రాభవం పెరిగిన తర్వాత పుకార్లు షికార్లు చేయడం బాగా ఎక్కువైపోయింది. నిజం ఏంటో కూడా తెలుసుకోకుండానే నెటిజన్లు కూడా వాటిని వైరల్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఓ ఘటన ఇప్పుడు నిఖిల్ లైఫ్‌లో జరిగింది. గత కొన్ని రోజులుగా నిఖిల్ విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పెళ్లై రెండేళ్లు కూడా కాలేదు అప్పుడే విడిపోతున్న నిఖిల్ దంపతులు అంటూ చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తలపై నిఖిల్ సిద్ధార్థ స్పందించాడు. మాములుగా రియాక్ట్ అవ్వడం కాదు.. పుకార్లు స్ప్రెడ్ చేసే వారిని లాగికొట్టినట్లాగ సిద్ధార్థ రియాక్ట్ అయ్యాడు అంటున్నారు.
నేరుగా నిఖిల్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. జస్ట్ తన భార్యతో కలిసున్న ఫొటో ఒకటి పెట్టి దానికి ఒక క్యాప్షన్ జత చేశాడు. “నీతో కలిసున్న ప్రతి నిమిషం అద్భుతం పల్లవి” అంటూ నిఖిల్ కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నిఖిల్ ఫ్యాన్స్ అంతా.. సూపర్ కపుల్, బెస్ట్ కపుల్ మీరు అంటా కామెంట్ చేస్తున్నారు. నిఖిల్ నెక్ట్స్ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ రాసిన కథను 18 పేజేస్ పేరిట తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ నవంబర్ 22న విడుదల కానుంది.