Neha Chowdary: ఫారెన్‌లో మొదలై తెలుగు నాట దుమ్ము రేపుతున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’. ఈ షో తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. తాజాగా, ఆదివారం ఆరో సీజన్ మొదలైంది. 21 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. వారిలో దాదాపు 11 మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిల్లో యాంకర్ నేహా చౌదరి కూడా ఒకరు. ఈమె స్టార్ స్పోర్ట్స్‌లో యాంకర్‌గా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నేహా దాదాపు 11 ఏళ్లుగా యాంకరింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. తాజాగా, నేహా చౌదరి.. సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
చిన్నతనంలో తాను ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకుని ఎమోషనల్ అయ్యారు. నేహా మాట్లాడుతూ.. ‘‘ నేను చాలా చిన్న వయసులోనే చాలా ఫాస్ట్‌గా జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నా. సీనియర్స్‌తో పోటీ పడేదాన్ని. నా కోచ్ కూడా ప్రాక్టీస్ చేపించేటప్పుడు నా సీనియర్స్‌తో చేపించేవాడు. నా సీనియర్ ఓ అమ్మాయి ర్యాగింగ్ కంటే ఘోరంగా నన్ను టార్చర్ చేసింది. ఇంకా కొంతమంది నన్ను దారుణంగా టార్చర్ చేసేవాళ్లు. నేను పడుకుని ఉంటే గట్టిగా గిచ్చి పారిపోయవారు. లేచిచూస్తే ఎవరూ ఉండేవాళ్లు కాదు.
పక్కన దాక్కుని నవ్వుతూ ఉండేవారు. ఏదైనా ఈవెంట్ కోసం ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా నన్ను ఏడిపించేవారు. నాకిప్పటికీ గుర్తుంది. ఓసారి ట్రైన్లోంచి దూకేద్దామా అన్నంత ఏడుపొచ్చింది. నేను ట్రైన్లో పైన పడుకుని ఉంటే.. కిందనుంచి పినీసులతో, పుల్లలతో గుచ్చేవాళ్లు. బాగా ఏడ్చేదాన్ని. కానీ, నేను ఇది అమ్మావాళ్లకు చెప్పలేకపోయేదాన్ని’’ అని అన్నారు. మరి, నేహా చౌదరి చిన్న తనంలో ఎదుర్కొన్న కష్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Neha Chowdary: నేహా చౌదరి.. బిగ్ బాస్ హౌస్‌లో క్రికెట్ ఆడిస్తుందా?