లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసి, సౌత్ మొత్తం కవర్ చేసేసింది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ సత్తా చాటే పనిలో ఉంది. ఈ మధ్య పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు షాకింగ్ డెసిషన్ తీసుకుంది. దీంతో అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘మానస్సినక్కరే’ అనే మలయాళ సినిమాతో 2003లో నయనతార తెరంగేట్రం చేసింది . ‘చంద్రముఖి’, ‘వల్లభ’ లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ‘లక్ష్మీ’చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. యోగి, దుబాయ్ శీను, తులసి, బిల్లా, అదుర్స్, సింహా, శ్రీరామరాజ్యం, తదితర సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి ఆకట్టుకుంది.
ఓవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. ‘నేనే రౌడీనే’ సినిమా చేస్తున్నప్పుడే డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో పడిన నయనతార.. దాదాపు ఏడేళ్లపాటు రిలేషన్ షిప్ మెంటైన్ చేసింది. ఈ ఏడాది మేలో అతడినే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అటు ఫ్యామిలీ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తోంది. ఇలాంటి టైమ్ లో నయన్ నటనకి గుడ్ బై చెప్పనుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతమైతే ఈమె చిరు ‘గాడ్ ఫాదర్’, షారుక్ ఖాన్ ‘జవాన్’, పృథ్వీరాజ్ ‘గోల్డ్’ సినిమాల్లో నటిస్తోంది.
ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత యాక్టింగ్ కి గుడ్ బై చెప్పబోతున్న నయనతార.. అనంతరం ఇతర వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ జీవితాన్ని గడపాలని భావిస్తున్నట్లు సమాచారం. నిర్మాతగా భర్త విఘ్నేశ్ తో కలిసి మంచి చిత్రాలు తీయాలని ప్లాన్ చేసుకుంటోంది. మరి నయన్ తీసుకున్న నిర్ణయం గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: నయనతార కొత్తిల్లు.. ఇంటీరియర్ డిజైన్ కోసం ఏకంగా రూ.25 కోట్ల ఖర్చు!