నందమూరి బాలకృష్ణపై నటుడు నవీన్ చంద్ర తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి నటించిన చిత్రం విరాటపర్వం. ఎన్నో వాయిదాల నడుమ ఈ మూవీ ఎట్టకేలకు ఈ నెల 17న విడుదలకు సిద్దమవుతోంది.
అయితే ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు విలక్షణ నటుడు నవీన్ చంద్ర. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న ఆయన నందమూరి బాలకృష్ణపై కొన్ని కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో బాలయ్య లాంటి హీరోని నేను ఇంత వరకు చూడలేదని, ఆయనతో వర్క్ చేసిన రోజులు ఎంతో అద్భుతంగా గడిచాయని అన్నారు. ముద్దు పెట్టుకోవాలనే ప్రేమ బాలకృష్ణపై కలిగిందంటూ నవీన్ చంద్ర చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: NTR ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ప్రశాంత్ నీల్ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్!
ఇక ఆయన ఎనర్జీ గురించి చెప్పటానికి అసలు మాటలే లేవని అన్నారు. బాలకృష్ణ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారని, అవన్నీ నిజం కాదని కూడా తెలిపారు. నేను చూసిన బాలయ్య పూర్తిగా వేరని ఆయన మంచి తనం గురించి నవీన్ చంద్ర చెప్పుకొచ్చారు. ఇక గోపీచంద్ సినిమాలో బాలయ్య నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూవీలో మీరంత బాలకృష్ణ విశ్వరూపాన్ని చూస్తారని, బాలయ్య లుక్స్, డైలాగ్ డెలవరీ నాకు బాగా నచ్చాయంటూ నవీన్ చంద్ర తెలిపారు. తాజాగా నందమూరి బాలకృష్ణపై నవీన్ చంద్ర చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బాలకృష్ణపై నవీన్ చంద్ర చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.