సీనియర్ నటుడు నరేష్ పేరు చెప్పగానే ఆయన చేసిన సినిమాలు కాదు.. నటి పవిత్రా లోకేష్ అందరికీ గురొస్తుంది. గత కొన్నాళ్ల నుంచి ఎక్కడికైనా సరే వీళ్లిద్దరూ కలిసే వెళ్తున్నారు. ప్రతిచోటా కూడా కలిసే కనిపిస్తున్నారు. దీంతో వీరి బంధంపై సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాకున్నారు. కొందరు ట్రోల్స్ చేస్తే వారిపై ఈ జంట కేసులు కూడా పెట్టారు. ఆ గొడవ ప్రస్తుతం నాంపలి కోర్టులోనే ఉంది. ఇలాంటి టైంలో తాజాగా న్యూయర్ సందర్భంగా నరేష్-పవిత్ర.. ఓ వీడియో రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చారు.
ఇక విషయానికొస్తే.. హీరోయిన్ కమ్ డైరెక్టర్ విజయనిర్మల వారసుడిగా నరేష్, టాలీవుడ్ లో చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో హీరోగా చేసి ఫేమ్ సంపాదించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీలైఫ్ గడుపుతున్నారు. కొన్నాళ్ల నుంచి ఆయన నటి పవిత్రా లోకేష్ తో కలిసి ఉంటున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది నిజమనేలా ఇంటా, బయట కలిసే కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్ల రిలేషన్ స్టేటస్ ఏంటనేది ఎవరికీ అర్థం కాలేదు. వీటికి ఎండ్ కార్డ్ వేస్తూ నరేష్.. పవిత్రని పెదాలపై ముద్దు పెడుతున్న వీడియోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో చివర్లో ‘గెట్టింగ్ మ్యారీడ్ సూన్'(త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం) అని టెక్స్ట్ కనిపించింది. దీంతో నరేష్-పవిత్ర త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారని అందరూ రాసేశారు. అయితే ఇదంతా కూడా ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా ప్రమోషన్ కోసం సమాచారం. సోషల్ మీడియాలో పలువురు ఈ విషయం డిస్కస్ చేస్తున్నారు. ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నరేష్-పవిత్ర బయోపిక్ అని కూడా కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. మరి కిస్ వీడియో చూడగానే మీకు ఏమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.
New Year ✨
New Beginnings 💖
Need all your blessings 🙏From us to all of you #HappyNewYear ❤️
– Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022