సినిమా టికెట్ల రేట్ల అంశం ఏపీలో ఎంతటి రాజకీయా వివాదాన్ని రాజేసిందో అందరికి తెలిసిన సంగతి సంగతే. దాదాపు 2-3 నెలలు ఈ అంశం మీద ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీకి మధ్య చిన్న పాటి యుద్ధం జరిగిందనే చెప్పవచ్చు. చివరకు జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను నిర్ణయించేందుకు ఓ కమిటీని వేసి.. సమస్యను పరిష్కరించింది. ఆ సమయంలో సినిమా టికెట్ల రేట్లపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్ సమయంలో.. ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్‌ను తగ్గించి ప్రేక్షకుడిని అవమానించింది అనడం.. సినిమా థియేటర్ కంటే పక్కనున్న కిరాణా షాపులోనే ఎక్కువ డబ్బులుంటాయంటూ నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
నాని వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉన్నాయంటూ వైసీపీ నేతలు కూడా నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ నాని అప్పట్లో వివరణ ఇచ్చుకున్నారు. వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ నాని ‘అంటే.. సుందరానికీ!’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన సినిమా టికెట్ రేట్స్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Aadhi Pinisetty: ఆది పినిశెట్టి పెళ్లి వేడుకలో హీరో నాని సందడి! వీడియో వైరల్!
‘‘నన్ను విమర్శించేవాళ్లందరూ తెలివి తక్కువవాళ్లు. 20..40..60 రూపాయల టికెట్ ధరలతో సినిమా ఇండస్ట్రీ మనుగడ సాధించలేదని అన్నాను. అంతే కానీ నేనేమీ టికెట్ ధరను రూ.500 పెంచమని అడగలేదు. అప్పుడు అది కూడా తప్పయితే.. ఇప్పుడు ఇది కూడా తప్పే’’ అన్నారు నాని. ప్రస్తుతం నాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: నాని – విజయ్ ఫ్యాన్స్ మధ్య ముదురుతున్న వార్.. ఆ సినిమానే కారణమా?
ఇక నాని, నజ్రీయా నజీమ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’ . వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం జూన్ 10న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Nani: పుష్ప సినిమాపై నాని సంచలన వ్యాఖ్యలు.. ‘పాన్ ఇండియా అని మనం అనుకుంటే సరిపోదు’!