తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి వారి మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తండ్రి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలయ్య.. గత కొన్ని దశాబ్దాలుగా తన సత్తా చాటుతున్నారు. టాప్ హీరోగా ఉంటూనే, ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేయడం ఒక్క బాలకృష్ణకి మాత్రమే సాధ్యం అయ్యింది. ఇందులో భాగంగానే బాలయ్య ఇప్పుడు కొత్తగా హోస్ట్ గా మారారు. బాలకృష్ణ యాంకర్ గా ప్రముఖ ఓటీటీ లో అన్ స్టాపబుల్ షో మొదలైన విషయం తెలిసిందే.
అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ కోసం మోహన్ బాబు గెస్ట్ గా విచ్చేశారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రోమో చూసిన వారికి.. అన్ స్టాపబుల్ ఏ రేంజ్ సక్సెస్ కాబోతుందో ఇప్పటికే అర్ధం అయిపోయింది. అయితే.., ఇప్పుడు బాలయ్య షోకి తదుపరి గెస్ట్ లుగా ఎవరు వస్తారన్న విషయంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
నేచురల్ స్టార్ నాని, దగ్గుబాటి రానా, ప్రభాస్ వంటి హీరోలు బాలయ్య షోకి గెస్ట్ లుగా రాబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా.. ఈ లిస్ట్ లో జూనియర్ యన్టీఆర్ పేరు కూడా ఉండటంతో అభిమానులను మరింత ఉత్సాహ పరుస్తోంది. ఒకవేళ యన్టీఆర్ గనుక ఈ షోకి వస్తే.. అన్ స్టాపబుల్ రీచ్ అమాంతం పెరగడం ఖాయం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.