ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి బుల్లితెర పై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఓవైపు టీవీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే.. మరోవైపు తన కొరియోగ్రఫీ లైఫ్ ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరికి అద్భుతమైన డాన్స్ నెంబర్స్ కొరియోగ్రాఫ్ చేసిన సంగతి తెలిసిందే. తాను కొరియోగ్రాఫ్ చేసే ప్రతి పాటల్లో కనిపించే స్టెప్పులు ఐకానిక్ అవుతుంటాయి.
సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్ స్టెప్స్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే.. స్టార్ మా ఛానల్ లో శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్న ‘కామెడీ స్టార్స్‘ షో లేటెస్ట్ ప్రోమో రిలీజయింది. ఆ ప్రస్తుతం వైరల్ అవుతున్న కామెడీ స్టార్స్ ప్రోమోలో కమెడియన్ ముక్కు అవినాష్ తన స్కిట్ లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అవమానించాడని ట్రోల్స్ జరుగుతున్నాయి. అవినాష్ స్కిట్ లో శేఖర్ మాస్టర్ గా యష్ మాస్టర్ కనిపించాడు.
ఈ స్కిట్ లో అవినాష్ లేడీ గెటప్ లో శేఖర్ మాస్టర్ ఫ్యాన్ గా అలరించాడు. ఇక శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ‘ఏక్ బార్.. ఏక్ బార్..’ సాంగ్ ఫ్లోర్ స్టెప్ చేస్తూ.. ‘ఏ టైంలో ఈ పాట కంపోజ్ చేశావో గానీ..’ అన్నాడు. వెంటనే స్పందించిన శేఖర్ మాస్టర్.. ‘ఏ టైంలో కంపోజ్ చేయడమేంట్రా..?’ అని నవ్వుకున్నాడు. ఆ విధంగా శేఖర్ మాస్టర్ స్టెప్స్ పై ముక్కు అవినాష్ పంచులు వేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కామెడీ స్టార్స్ లేటెస్ట్ ప్రోమో మీరు కూడా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.