తెలుగు బుల్లితెరపై వస్తున్న అతిపెద్ద డ్యాన్స్ రియాల్టీ షో ‘ఢీ’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు తమ టాలెంట్ చూపించి ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకున్నారు. మొదట ఢీ సీజన్ 1 ఇండియాన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సమర్పించారు. ఆ తర్వాత ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ఈ ఢీ స్టేజ్ పై తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ప్రస్తుతం డీ ఛాంపియన్స్ కి వ్యాఖ్యాతగా ప్రదీప్ మాచిరాజు వ్యవహరిస్తున్నాడు. జబర్ధస్త్ హైపర్ ఆది, బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఢీ షోకి మాస్ మహరాజ ప్రత్యేక అతిథిగా ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపాడు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం ఢీ 14 డ్యాన్సింగ్ ఐకాన్ గ్రాండ్ ఫైనల్ సందర్భంగా మాస్ మహరాజ రవితేజ ప్రత్యేక గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాచిరాజు హీరో రవితేజను ‘కంటెంట్ తప్ప కాంట్రవర్సీ లేని హీరో.. పవర్ తప్ప పొగరు లేని హీరో.. ఇదిగో అబ్బాయ్ వస్తున్నాడు మన మిరపకాయ్.. మాస్ మహరాజ రవితేజ’అంటూ ఓ రేంజ్ లో స్వాగతం పలికాడు. ఇక రవితేజ స్టేజ్ పైకి రాగానే విజిల్స్, కేకలు అరుపులతో సందడి మొదలైంది.. రవితేజ ‘ఓరే ఆగండ్రా ఒరేయ్’ అంటూ సందడి చేశాడు. మరి రవితేజ ఢీ స్టేజ్ పై తన కామెడీ, బాడీ లాంగ్వేజ్ తో ఎలాంటి జోష్ నింపుతాడో చూడాలి. గత ఏడాది ఢీ గ్రాండ్ ఫినాలేకి అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఇండస్ట్రీలో హిట్.. ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు మాస్ మమరాజ రవితేజ. ఇటీవల విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక రవితేజ మూవీస్ విషయానికి వస్తే.. ధమాకా మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ మూవీలో రవితేజ మాస్ హీరోగా కనిపించబోతున్నాడట. ఇ క బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేర్ వీరయ్య మూవీలో రవితేజ స్పెషల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢీ 14 లో రవితేజకు సంబంధించిన ప్రోమో నెట్టింట సందడి చేస్తుంది.