Manchu Vishnu: టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి పరిచయం అవసరం లేదు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు సినీ వారసత్వాన్ని ప్రస్తుతం ఆయన కుమారుడు మంచు విష్ణు ముందుకి తీసుకెళ్తున్నాడు. కేవలం హీరోగా సినిమాలు చేయడం మాత్రమే కాదు, ప్రస్తుతం మా అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా కీలక బాధ్యతలను నిర్వర్తిస్తూ.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. అయితే.. విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ మూవీ టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సందర్భంగా జిన్నా మూవీ యూనిట్ టీజర్ వేడుక నిర్వహించగా, ఆ వేదికపై నుండి మంచు విష్ణు కాస్త ఎమోషనల్గా మాట్లాడుకొచ్చారు.
విష్ణు మాట్లాడుతూ.. ‘‘ జిన్నా సినిమా నాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే నా బంగారు తల్లులు అరియనా, విరియానా ఈసినిమాలో పాట పాడారు. కోన వెంకట్ గారితో మాది విడదీయలేని అనుబంధం. మా నాన్న ఆయన్ని బాబాయ్ అని పిలిస్తే.. నేను మాత్రం బ్రదర్ అని పిలుస్తాను. చాలా రోజుల తరువాత ఆయనతో కలిసి పని చేయడం అందంగా ఉంది. ఇక నా కెరీర్ లో నాగేశ్వరరెడ్డి గారి స్థానం ప్రత్యేకం. ఆయన డైరెక్షన్ లో నేను నటించిన దేనికైనా రెడీ మంచి విజయాన్ని సాధించింది. ఆయన జిన్నాకి కథ అందించడం విశేషం. ఇక జిన్నా మూవీలో ఓ హీరోయిన్ గా ముందు సన్నీలియోన్ ని అనుకున్న సమయంలో కొన్ని అనుమానాలు ఉండేవి. అయితే.. మిగతా యూనిట్ అంతా సన్నీకి ఓటు వేయడంతో మరో ఆలోచన లేకుండా ఆమెని ఫైనల్ చేశాము. శ్రీనువైట్ల తరువాత జిన్నా డైరెక్టర్ సూర్య వర్కింగ్ స్టయిల్ నన్ను బాగా ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న మాట వాస్తవమే. అయితే.. ఇంత ఇబ్బందుల్లో కూడా మేము సినిమాలు చేసేది.. అభిమానుల ప్రేమ, అభిమానం కోసమే. ఫ్యాన్స్ లేకుంటే మేము లేము. మేము ఎంత కష్టపడ్డా వారి కోసమే. వారిని మెప్పించడం కోసమే ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటాను అని విష్ణు మాట్లాడారు. ఇక జిన్నా టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో చిత్ర యూనిట్ అంతా ఆనందంగా ఉన్నారు. మరి.. జిన్నా మూవీ మంచు విష్ణుకి సాలిడ్ సక్సెస్ అందిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Puri Jagannadh: దర్శకుడు పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య!