సినిమా వాళ్లంలే పబ్లిక్ ప్రాపర్టీలాగా భావిస్తుంటారు కొంతమంది. వారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఈ జాడ్యం మరింత పెరిగింది. నేరుగా సినిమా వాళ్ల సోషల్ మీడియా ఖాతాలకు మెసేజ్‌లు చేస్తున్నారు. అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నారు. కొంతమంది బరితెగించి ప్రవర్తిస్తున్నారు. బూతు ప్రశ్నలు సైతం వేస్తున్నారు. ముఖ్యంగా నటీమణులను టార్గెట్ చేసి, పాడు ప్రశ్నలు వేయటం బాగా పెరిగిపోయింది. రిప్లై ఇస్తే ఒకలా.. ఇవ్వకపోతే ఒకలా టార్చర్ చేస్తున్నారు. సున్నిత మనస్కులైన నటీమణులు వీరి దెబ్బకు సోషల్ మీడియా ఖాతాలను వదిలేస్తుంటే.. మిగిలిన వాళ్లు చెత్త మాట్లాడే నెటిజన్లకు గట్టిగా బుద్ధి చెబుతున్నారు.
తాజాగా, ప్రముఖ బహుభాషా హీరోయిన్ మళవిక మోహనన్‌కు ఓ డబుల్ మీనింగ్ ప్రశ్న వేశాడు ఓ నెటిజన్. అతడు తన ట్విటర్ ఖాతాలో ఆమె ఫొటోను, ఆమె కొత్త సినిమా ఫొటోను పక్క పక్కనే ఉంచి పోస్ట్ చేశాడు. కుడి వైపు ఉన్న ఫొటోలో మాళవిక హీరోతో కలిసి ఉంది. ఈ ఫొటోపై ఆ నెటిజన్.. ‘‘వాటిని మాథ్యూ ఎలా హ్యాండిల్ చేయగలుగుతాడని నాకు ఆత్రుతగా ఉంది’’ అని రాసుకొచ్చాడు. దీనిపై మాళవిక తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. ‘‘ అతడు వాటిని చాలా బాగా హ్యాండిల్ చేశాడు’’ అని అంది. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వీటిపై స్పందిస్తున్న నెజటిన్లు మాళవిక ఇచ్చిన రిప్లైకి ఫిదా అవుతున్నారు. తప్పుడు వ్యక్తులకు ఇలాంటి సమాధానంతోనే బుద్ధి చెప్పాలని అంటున్నారు. కాగా, మాళవిక పట్టమ్ పోలె అనే మలయాళ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. పేట సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ ‘మాస్టర్’ సినిమాతో స్టార్ హీరోయిన్గా మారారు. ప్రస్తుతం తంగలాన్ అనే తమిళ సినిమాలో, యుధ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు శరావేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. మరి, నెటిజన్ డబుల్ మీనింగ్ ప్రశ్నకు మాళవిక అదిరిపోయే రిప్లై ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
He handled it really well
— malavika mohanan (@MalavikaM_) January 18, 2023