ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలే బాక్సాఫీస్ ని శాసిస్తున్నాయి. సినిమాలలో ఎంతటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, సరైన కంటెంట్ లేకపోతే సినిమాలను లైట్ తీసుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ ఏడాది చాలా సినిమాలు కంటెంట్ పరంగా వచ్చిన చిన్న సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హీరోల స్టార్డమ్ పై కాకుండా మంచి కథలతో వస్తే.. డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగు ఆడియెన్స్ అందలం ఎక్కిస్తుంటారు. రీసెంట్ కన్నడ సినిమా కాంతార విషయంలో అదే జరిగింది.. ఇప్పుడు తమిళ డబ్బింగ్ ‘లవ్ టుడే’ విషయంలోనూ అదే జరుగుతోంది. అవును.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన లవ్ టుడే మూవీ తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ అదరగొడుతోంది.
‘కోమాలి’ మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్.. తన రెండో సినిమాలో తానే హీరోగా నటించాడు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి తెరకెక్కించిన యూత్ ఫుల్ మూవీ ‘లవ్ టుడే’. తమిళంలో ముందే రిలీజైన ఈ సినిమా.. అద్భుతమైన విజయాన్ని అందుకొని.. రూ. 50 కోట్లు వసూల్ చేసింది. దీంతో ఇటీవల నిర్మాత దిల్ రాజు.. ‘లవ్ టుడే’ మూవీని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశాడు. నవంబర్ 24న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా.. తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. యూత్ ఫుల్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ట్రైలర్ తోనే జనాలను ఆకర్షించింది.
ఇక ప్రదీప్ రంగనాథన్ సరసన హీరోయిన్ గా ఇవానా నటించింది. సత్యరాజ్, రాధికా శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించారు. కాగా.. తెలుగు రాష్ట్రాలలో లవ్ టుడే మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేశారు దిల్ రాజు. అయితే.. ఓరల్ గా రూ. 2.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకి రూ. 3 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా సెట్ అయ్యింది. ఈ టార్గెట్ విడుదలైన మూడో రోజే క్లియర్ చేసేసింది సినిమా. ఇక లవ్ టుడే ఐదు రోజుల కలెక్షన్స్ చూసినట్లయితే.. ఇప్పటివరకు రూ. 9.08 కోట్లు గ్రాస్.. రూ. 4.70 కోట్లు షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. మరి తెలుగు రాష్ట్రాలలో లవ్ టుడే మూవీ ఐదు రోజుల కలెక్షన్స్ ఏరియా వైస్ ఎలా ఉన్నాయో చూద్దాం!
లవ్ టుడే మూవీ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాలలో 5 రోజుల వరకు ఈ విధంగా నమోదు అయ్యాయి. ఇప్పటికైతే ప్రొడ్యూసర్ దిల్ రాజు.. బ్రేక్ ఈవెన్ తర్వాత రూ. 1.70 కోట్ల ప్రాఫిట్ లో ఉన్నారు. చూడాలి మరి మున్ముందు లవ్ టుడే మూవీ ఎలాంటి మ్యాజిక్ నెంబర్స్ రీచ్ అవుతుందో!