రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే.. ఇప్పటివరకు పోస్టర్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన లైగర్ టీమ్, ఈసారి మాసివ్ గ్లింప్స్ రిలీజ్ చేసి అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిందనే చెప్పాలి.
ఈ యాభై సెకండ్ల గ్లింప్స్ లో పూరీ మార్క్ తో విజయ్ ఎంట్రీ అదరగొట్టాడు. బాక్సింగ్ రింగులోకి దింపే ముందు ఇంట్రడక్షన్ లో విజయ్ ని ముంబై స్లమ్ డాగ్, చాయ్ వాలా అంటూ పరిచయం చేశాడు దర్శకుడు. అదీగాక ఈ గ్లింప్స్ లో రమ్యకృష్ణ టి అమ్ముతూ కనిపించడం విశేషం. ముంబై స్లమ్ ఏరియాలో పెరిగిన విజయ్.. ప్రపంచం గుర్తించే బాక్సర్ గా ఎలా ఎదిగాడనేది సినిమా కథగా అర్దమవుతుంది. “వాట్ లగా దేంగే” అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో.. 2022 ఆగస్ట్ 25న విజయ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మరి ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ.. సినిమా పై అంచనాలు పెంచేసిన లైగర్ గ్లింప్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.