ఈ బ్యూటీ నవ్వితే చాలు మీరేంటి ఎవరైనా ఫిదా అవుతారు. త్వరలో ఓ హీరోని పెళ్లి కూడా చేసుకోనుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఈ మధ్య కాలంలో ఈమె పెద్దగా సినిమాలేం చేయలేదు. కానీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈమె పెళ్లి చేసుకోనుందనే న్యూస్ బయటకు రావడం. తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ టాలీవుడ్ లో కలిసిపోయింది. దాదాపు పదేళ్ల నుంచి సినిమాలు చేస్తూనే ఉంది. కాకపోతే ఒకటి, రెండు మూవీస్ తప్పితే చెప్పుకోవడానికి సరైన హిట్ లేదు. అయితేనేం ఇప్పుడు ఏకంగా ఓ హీరోని పెళ్లి చేసుకోనుందని అంటున్నారు. మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్లకు కావాల్సింది గ్లామర్. ఇది ఈ హీరోయిన్ కి బోలెడంత ఉంది. జస్ట్ నవ్వితే చాలు సొట్టబుగ్గలు వస్తాయి. అవి చూస్తే మీరు నేను కాదు ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. హైట్-వెయిట్ కూడా ఫెర్ఫెక్ట్ గా మెంటైన్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. అవును మీరనుకున్నది కరెక్టే. పైన ఫొటోలో ఉన్న పాప లావణ్య త్రిపాఠి. ‘అందాల రాక్షసి’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎవరీ అమ్మాయని అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది.
2012లో హీరోయిన్ గా ఫస్ట్ మూవీ చేసింది. ఈ సినిమా యావరేజ్ అనిపించుకున్న ఈ బ్యూటీకి మాత్రం చాలా పేరొచ్చింది. భలేభలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి చిత్రాలతో హిట్ కొట్టింది. అదే ఏడాది ‘శ్రీరస్తు శుభమస్తు’ మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు హిట్ దక్కడం లేదు. రీసెంట్ గా ‘పులి మేక’ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. సరే ఇదంతా పక్కనబెడితే కలిసి రెండు సినిమాలు చేసిన మెగాహీరో వరుణ్ తేజ్ తో ఈమెకు జూన్ లో ఎంగేజ్ మెంట్ జరగనుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. సరే ఇది పక్కనబెడితే ఈ బ్యూటీ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.