న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ కి మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఇక సినిమాకి హిట్ టాక్ రావడంతో ఈ కలెక్షన్స్ మరో వారం రోజులు కంటిన్యూ కావడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సినిమాలో నాని, సాయిపల్లవికి నటనకి మంచి ఆదరణ లభిస్తోంది. కానీ.., ఇందులో మరో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి అలియాస్ బేబమ్మ అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఇందులోకృతి కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో ఎలాంటి తడబాటు లేకుండా నటించి మెప్పించింది. ఇక కృతి శెట్టి స్మోకింగ్ సీన్స్ కూడా శ్యామ్ సింగ రాయ్ లో హైలెట్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే తన పాత్రపై కృతి శెట్టి మీడియా ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇది కూడా చదవండి:
చనిపోయిన అమ్మని చూడటానికి కొడుకు సాహసం!
“ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ రెండు విభిన్నమైన చిత్రాలు. బేబమ్మ పాత్ర కోసం తెలుగు సినిమాలను రెఫెరెన్స్ గా తీసుకున్నాను.శ్యామ్ సింగ రాయ్ కోసం ఇంగ్లీష్ సినిమాలు చూసి.. ఓ మోడ్రన్ అమ్మాయిలా ఎలా ఉండాలో తెలుసుకున్నాను. ఇక శ్యామ్ సింగ రాయ్ లో కాస్త బోల్డ్ సీన్స్ లో నటించాను. ముందుగా ఈ సీన్స్ వద్దని దర్శకుడికి చెప్పాను. కానీ.., కథ రీత్యా ఈ సీన్స్ అవసరం కాబట్టి నటించక తప్పలేదు. ఇలాగే స్మోకింగ్ సీన్స్ కూడా. నాకు స్మోకింగ్ అంటే నచ్చదు. కానీ.., శ్యామ్ సింగ రాయ్ కోసం స్మోక్ కూడా చేయాల్సి వచ్చింది. దర్శకుడు నా కోసం స్పెషల్ సిగరెట్లు తెప్పించారు. అవి ఆరోగ్య సేతు సిగరేట్లు. దాంట్లో ఓన్లీ మిల్క్ టేస్ట్ ఉంటుంది.ఈ సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశాను. అయినా.. షూట్ చేసే సమయంలో నా చేతులు వణికిపోయాయి” అని కృతి శెట్టి తెలియజేసింది. ఇలా కెరీర్ స్టార్టింగ్ లోనే అన్నిటికీ సిద్ధమంటున్న కృతి శెట్టి రానున్న కాలంలో ఇండస్ట్రీని దున్నేయడం గ్యారంటీ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.