SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Krishnam Raju Passed Away Krishnam Raju Wiki

Krishnam Raju: రెబల్ కృష్ణంరాజు జీవితంలో మీకు తెలియని విశేషాలు!

  • Written By: ChanDuuu
  • Updated On - Sun - 11 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Krishnam Raju: రెబల్ కృష్ణంరాజు జీవితంలో  మీకు తెలియని విశేషాలు!

ఇప్పటి జనరేషన్ వాళ్లకు రెబల్ స్టార్ అంటే ప్రభాస్ గుర్తొస్తారు. అసలైన రెబల్ స్టార్ అంటే కృష్టంరాజు(83). ఇప్పుడు ఆయన అనారోగ్య సమస్యలతో మరణించడం ఇండస్ట్రీకి తీరనిలోటు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3:25 గంటలకు మరణించారు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల్ని అశేషంగా అలరించిన ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో కృష్ణంరాజు జీవితం, అందులో కొన్ని ముఖ్యమైన విషయాల సమాహారమే ఈ స్టోరీ.

1940 జనవరి 20న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జన్మించారు. ఆయన చదువు పూర్తికాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకున్నారు. ‘చిలకా గోరింకా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ తనలో అసలు నటుడిని బయటకు తీసేందుకు విలన్ గానూ నటించారు. సూపర్ స్టార్ కృష్ణ ‘అవేకళ్లు’ చిత్రంలో విలన్ గా కృష్ణంరాజు నిరూపించుకున్నారు. అలా కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో ఏలిన కృష్ణంరాజు.. 183కు పైగా చిత్రాల్లో నటించారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మాన్న సినిమాలు కృష్ణంరాజుకి స్టార్ స్టేటస్ తీసుకొచ్చాయి.

krishnam-raju-passed-away-krishnam-raju-wiki

Join Our Whatsapp Channel

హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన కృష్ణంరాజు.. సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా, రెబల్, రాధేశ్యామ్ సినిమాలతో పాటు రుద్రమదేవి, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాల్లోనూ పాత్రలు చేశారు. గోపీకృష్ణ మూవీస్ సంస్థ స్థాపించి నిర్మాతగానూ పలు సినిమాలు తీశారు. చివరగా ‘రాధేశ్యామ్’ సినిమాలో నటించారు. ఇక 1977, 1984లో కృష్ణంరాజు నంది అవార్డు గెలుచుకున్నారు. 1988లో ‘తాండ్రపాపారాయుడు’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవన సౌఫల్య పురస్కారం, 2014లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని కృష్ణంరాజు దక్కించుకున్నారు.

ఇక కృష్ణంరాజు వైవాహిక జీవితం విషయానికొస్తే.. ఆయన మొదటి భార్య పేరు సీతాదేవి. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది . 1995 కారు ప్రమాదంలో సీతాదేవి మరణించడంతో చాలాకాలం రెబల్ స్టార్ తీవ్ర డిప్రెషన్ లో ఉండిపోయారు. 1996లో శ్యామలాదేవితో రెండో వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన సోదరుడు యూవీ సూర్యనారాయణరాజు. ఆయన కుమారుడే హీరో ప్రభాస్. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించారు. పెదనాన్న పేరు నిలబెట్టారు.

krishnam-raju-passed-away-krishnam-raju-wiki

ఇక రాజకీయ జీవితానికొస్తే.. 1991లో తొలుత కాంగ్రెస్ లో చేరిన కృష్ణంరాజు.. అదే ఏడాది నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి తెదేపా అభ్యర్థి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు కొద్దిగా దూరంగా ఉన్నారు. మళ్లీ 1998లో 13వ లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి, కాకినాడ నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో అప్పుడు.. నర్సాపురం లోక్ సభ నుంచి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలిచారు. అలా కేంద్రంలో అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2004లో లోక్ సభ ఎన్నికల్లో అదే స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2009 మార్చిలో చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో చేరారు. అలా నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందిన కృష్ణంరాజు.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఎన్నో మరపురాని సినిమాలు అందించి దివికేగారు.

ఇదీ చదవండి: కృష్ణం రాజు చివరి కోరిక అదే? తీరకుండానే ఆయన స్వర్గస్తులయ్యారు..

Tags :

  • anushka shetty
  • Krishnam Raju
  • Prabhas
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Prabhas | ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్!

ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

    ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

  • సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

    సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

  • ఆ సమస్యతో బాధపడుతోన్న ప్రభాస్!.. త్వరలో సర్జరీ!

    ఆ సమస్యతో బాధపడుతోన్న ప్రభాస్!.. త్వరలో సర్జరీ!

  • రీ రిలీజ్‌కి సిద్ధమైన ప్రభాస్ ప్లాప్ మూవీ.. ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందా?

    రీ రిలీజ్‌కి సిద్ధమైన ప్రభాస్ ప్లాప్ మూవీ.. ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam