స్టార్ సింగర్ అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. అతడి మేనేజర్ కలుద్దామని వెళ్లేటప్పటికే ఇలా ఉండేసరికి పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
కొరియన్ మూవీస్, వెబ్ సిరీసులు.. వీటి గురించి కొన్నేళ్ల ముందు వరకు మనకు పెద్దగా తెలియదు. ఓటీటీ పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లో ఇవి చాలా పాపులర్ అయిపోయాయి. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిలు.. K-డ్రామాగా సిరీసులకు తెగ అడిక్ట్ అయిపోయారు. అలా కొరియన్ యాక్టర్స్, సింగర్స్ అందరూ కాస్తోకూస్తో పరిచయమే. ఇప్పుడు ఆ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే స్టార్ సింగర్ కమ్ యాక్టర్ అయిన మూన్ బిన్.. తన ఇంట్లోనే అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
అసలు విషయానికొస్తే.. కొరియన్ స్టార్ పాప్ సింగర్, నటుడు మూన్ బిన్ (25) మరణించారు. దక్షిణా కొరియాలోని అతడి ఇంట్లోనే మృతదేహాన్ని తన మేనేజర్ గుర్తించారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మూన్ బిన్ ఆత్యహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ASTRO సభ్యుడైన మూన్ బిన్.. బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్, ది మెర్మెయిడ్ ప్రిన్ లాంటి కొరియన్ మూవీస్ లోనూ నటించి పేరు తెచ్చుకున్నాడు. అలా ఇతడు ఇప్పుడు సడన్ గా ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానులకు తావిస్తోంది. ఈ సింగర్ ఎందుకు చనిపోయి ఉండొచ్చని మీరనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
The industry mourns for ASTRO Moonbin’s passing
LE SSERAFIM to cancel photo-time for Knowing Bros
MCountdown to air in a calm manner with no SNS promotion
Music Bank to cancel photo-time
IU reschedule her interview for ‘Dream’ to April 24
Billlie to postpone their activities pic.twitter.com/WvFHcQfPUQ
— The Seoul Story (@theseoulstory) April 20, 2023