ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వేరే సెలబ్రిటీల హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ని అనుకరించడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అంటూ ట్రెండ్ ని ఫాలో అవుతుంటారు. ఇక ప్రెజెంట్ ట్రెండ్ ప్రకారం.. డైలాగ్స్, యాటిట్యూడ్ తో రీల్స్ చేయడం మామూలే. ఈ ట్రెండ్ నే ఫాలో అవుతూ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పోషించిన గంగూభాయ్ యాటిట్యూడ్ ని అనుకరించింది మెగా డాటర్ నిహారిక. గంగూభాయ్ కతియావాడి మూవీలో క్యారెక్టర్ కి గాను అలియా భట్ ఉత్తమ నటిగా పేరుతో పాటు అవార్డులు కూడా అందుకుంది.
తాజాగా నిహారిక అలియా భట్ ని అనుకరిస్తూ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే గంగూభాయ్ వీడియోని ఛాలెంజింగ్ గా తీసుకున్నానని, ఈ వీడియోలో నా యాక్టింగ్, గెటప్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి అని క్యాప్షన్ జోడించింది. ఇక వీడియో చూసినట్లయితే.. గంగూభాయ్ పాత్రలో నిహారిక అద్భుతంగా యాటిట్యూడ్ కనబరిచిందని చెప్పవచ్చు. వైట్ సారీలో కట్టు బొట్టు అన్నీ కూడా ఆ క్యారెక్టర్ ని ఫాలో అవుతూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వీడియోలో నిహారిక భర్త చైతన్య కూడా ఉండటం విశేషం.
ఇదిలా ఉండగా.. యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించిన నిహారిక.. ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. ఆ సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వకపోయేసరికి సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుంది. ఇటీవలే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసి ఓటిటి సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే నిహారిక.. భర్తతో కలిసి ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫోటోలు, వీడియోలు, మూవీ అప్ డేట్స్ పోస్ట్ చేస్తుంటుంది. అంతేగాక అప్పుడప్పుడు భర్తతో కలిసి చేసిన రొమాంటిక్ ఫోటోషూట్స్ కూడా షేర్ చేస్తుంది. మరి మెగా డాటర్ నిహారిక గంగూభాయ్ క్యారెక్టర్ లో చేసిన వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.