హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తమిళ హీరో అయినప్పటికీ, టాలీవుడ్ లోనూ కోలీవుడ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ నిజజీవితంలోనూ సూర్య హీరోగా నిలుస్తున్నారు. పేద పిల్లలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి, అభిమానులకు అనేక విధాలుగా సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంటుంటారు సూర్య. తాజాగా మరోసారి ఈ కోలీవుడ్ హీరో తన ఉదారతను చాటుకున్నారు. ప్రమాదంలో మరణించిన తన అభిమాని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తమిళనాడులోని నామక్కల్ జిల్లా చెందిన జగదీశన్ అనే వ్యక్తి.. హీరో సూర్య అభిమాన సంఘ కార్యదర్శి. సూర్య పేరున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఇటీవల జగదీశన్ మోటార్ సైకిల్‌పై వెళుతుండగా నామక్కల్ పోలీస్ స్టేషన్ సమీపంలో అతడి బైక్ ను లారీ ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న హీరో సూర్య గత శనివారం రాత్రి నామక్కల్ లోని జగదీశన్ ఇంటికి వెళ్లి.. ఆయన భార్య, పిల్లల్ని పరామార్శించారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని హామి ఇచ్చి,
ఇదీ చదవండి: ధాకడ్ సినిమా బడ్జెట్ రూ.90 కోట్లు.. అమ్ముడైన టికెట్లు 20..!వారి రెండున్నరేళ్ల కూతురు విద్యకు అవసరమైన ఆర్థిక సాయం తాను చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో సూర్య వచ్చిన విషయం తెలుసుకన్న స్థానికులు ఆయన్ని చూడటానికి గుమిగూడారు. సూర్య ఉదారతపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అభిమాన్ని కోసం సూర్య స్వయంగా రావడం పట్ల ఆయన ఆభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సూర్య అన్న మంచి మనసుకు జోహార్లు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.