సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన టాక్ షోలలో ‘కాఫీ విత్ కరణ్’ ఒకటి. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో.. ఇప్పటివరకు 6 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇక ఇటీవలే 7వ సీజన్ కూడా మొదలై వివాదాస్పదంగా మారింది. షోలో పాల్గొనే వాళ్లను కెరీర్, సినిమాల గురించి అడగడం మనం చూస్తుంటాం. కానీ.. కరణ్ జోహార్ పంథా వేరు. వచ్చిన సెలబ్రిటీలందరినీ శృంగారం గురించి అడుగుతూ.. ఇబ్బంది పెడుతున్నాడు.
అదీగాక ‘కాఫీ విత్ కరణ్‘ షోలో పాల్గొని తమ సినిమాలను ప్రమోట్ చేసుకుందామని అనుకుంటున్న సెలబ్రిటీలకు.. శృంగారం గురించి ప్రస్తావిస్తూ రోస్ట్ చేస్తున్నాడు. అలాగే వారి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే.. ఇప్పుడు కాఫీ విత్ కరణ్ షో 7వ సీజన్ ని టాక్ షో అనడం కంటే రోస్ట్ చేసే షో అంటే బెటర్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా షోలో పాల్గొన్న హీరోయిన్ సోనమ్ కపూర్, అర్జున్ కపూర్ లను కూడా అవే ప్రశ్నలు అడిగాడు కరణ్.
ఇక వచ్చీరాగానే సోనమ్, అర్జున్ లపై ప్రశ్నలు సంధించాడు కరణ్. అర్జున్ గురించి సోనమ్ తో.. ‘నీ ఫ్రెండ్స్ లో ఎంతమందితో అర్జున్ బెడ్ షేర్ చేసుకున్నాడు?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు సోనమ్ స్పందిస్తూ.. నేనేమి మాట్లాడలేను. నాకు అలాంటి బ్రదర్స్ లేరని చెప్పేసింది. అయినా కరణ్ అంతటితో ఆగకుండా.. మరి నీకెలాంటి బ్రదర్స్ ఉన్నారు? అని నవ్వేశాడు. దీంతో మధ్యలో కల్పించుకున్న అర్జున్ కపూర్.. అసలు నువ్వెలాంటి సిస్టర్ వి, బ్రదర్ గురించి ఏం చెప్తున్నావ్ తెలుస్తుందా? అన్నాడు.
అర్జున్ ఇంకా మాట్లాడుతూ.. ‘అయినా నన్ను సోనమ్ తో ట్రోల్ చేయించడానికే షోకి పిలిచారా? అని కరణ్ ని అడిగాడు. ఆ తర్వాత అర్జున్ నీ ప్రేయసి మలైకా నెంబర్ నీ ఫోన్ లో ఏమని సేవ్ చేసుకున్నావని అడిగాడు. అర్జున్ స్పందించి.. “నాకు మలైకా అనే పేరే ఇష్టం. అందుకే అదే సేవ్ చేసుకున్నా” అని బదులిచ్చాడు. ప్రస్తుతం వీరి ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి కరణ్ అడిగిన ప్రశ్నలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.