టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్.. తన ప్రతి సినిమాలో మాగ్జిమం కొత్త హీరోయిన్ని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ చిత్రం ద్వారా కొత్త అమ్మాయి కేతికా శర్మను తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇక ఈ భామ.. తొలి చిత్రంలోనే అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హద్దుల్లేని ఎక్స్‌పోజింగ్‌తో కుర్రకారుకి పిచ్చెక్కించడమే కాక.. సినిమాలో బోల్డ్ సన్నివేశాలకు కూడా సై అంది. ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో యువతకు పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతి పోగొడుతోంది. ఈక్రమంలో హాట్ బ్యూటీ తాజాగా ఓ ప్రైవేట్ ఆల్బంలో నటించింది. ఇక కేతికా డ్యాన్స్ చూసిన నెటిజనులు.. హాట్ ఫర్ఫమెన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మెల్విన్ లూయిస్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్తో కలిసి కేతికా శర్మ చేసిన ప్రైవేట్ ఆల్బం ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇంతకీ ఎవరి మెల్విన్ లూయిస్ అంటే.. బాలీవుడ్ ప్రైవేట్ ఆల్బమ్స్ చూసేవారికి ఇతడు బాగా తెలుసు. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ మాత్రమే కాక స్వయంగా యూట్యూబ్ చానెల్ని రన్ చేస్తున్నాడు. ఇతడు పలు టీవీ రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నాడు. మెల్విన్.. 2006లో యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసి.. తన డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేయడం ప్రారంభించాడు.
ఇది కూడా చదవండి: ‘రొమాంటిక్’ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. పిక్ వైరల్!
ప్రస్తుతం ఇతడు టాప్ యూట్యూబర్‌గా ఉన్నాడు. ఇతడి చానెల్‌కి 3.66 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటికే ఇతడు పలుమార్లు కేతికాతో కలిసి ప్రైవేట్ సాంగ్ చేయగా.. తాజాగా మరోసారి హాట్ బ్యూటీ కేతికాతో కలిసి కొత్త ఆల్బం రూపొందించాడు. ఇక దీనిలో వీరద్దరి మధ్య కెమిస్ట్రీ, డ్యాన్స్ మూవ్‌లు సూపర్ అని.. చాలా హాట్‌గా ఉన్నాయని నెటజనులు కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రభాస్ తో రొమాంటిక్ మూవీ టీమ్ ఫన్నీ చిట్ చాట్! ప్రభాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!