సాధారణంగా పెళ్లి వేడుకలో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అది ఎక్కడైనా సరే చాలా సర్వసాధారణం. మగపెళ్లి వారికి మర్యాదలు సరిగా చేయలేదనో, భోజనాలు సరిగా వడ్డించలేదనో, కట్నం డబ్బులు చెప్పిన టైంకి ఇవ్వలేదనో.. ఇలా పలు కారణాలతో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇక అంగరంగ వైభవంగా జరిగే హీరో లేదా హీరోయిన్ పెళ్లిలో ఇలాంటివి జరగడం దాదాపు అసాధ్యం. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పెళ్లిళ్లు అన్ని కూడా డెస్టినేషన్ వెడ్డింగులే. అంటే చాలా తక్కువ మంది ఉంటున్నారు. అలా జరిగిన ఓ స్టార్ హీరోయిన్ పెళ్లిలో చాలా పెద్ద గొడవ జరిగింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తెలుగు వారికి పరిచయమే. వెంకటేశ్ ‘మల్లీశర్వి’లో నటించింది ఈ భామనే. ఆ తర్వత ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో హిందీలో సెటిలైపోయింది. హీరో విక్కీ కౌశల్ తో కొన్నేళ్లపాటు డేటింగ్ చేసింది. గతేడాది డిసెంబరు 9 వీరిద్దరూ ఒక్కటయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత సినిమా షూటింగుల్లో కత్రినా, విక్కీ ఎవరికి వారు బిజీ అయిపోయారు. అయితే అప్పుడు పెళ్లిలో జరిగిన పెద్ద గొడవ గురించి కత్రినా తాజాగా బయటపెట్టింది.
‘పెళ్లి పీటలపై కూర్చుని గెస్టులవైపు చూస్తున్నాను. కానీ సడన్ గా నా వెనక నుంచి పెద్దగా సౌండ్స్ వినిపించాయి. దీంతో ఏం జరిగింది? అని వెనక్కి తిరిగి చూశాను. అక్కడ నా సిస్టర్స్, విక్కీ ఫ్రెండ్స్ గొడవ పడుతున్నారు. వారి గొడవ ఏ స్థాయికి చేరింది అంటే.. చివరికి కుర్చీలు, చెప్పుల్ని ఒకరిపై ఒకరు విసురుకుని మరీ తిట్టుకున్నారు. నేను ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లలేకపోయాను. అలానే ఆ గొడవలో ఎవరు గెలిచారు అనేది కూడా అడగడం మర్చిపోయాను’ అని కత్రినా కైఫ్ అప్పటి విషయాల్ని నవ్వుతూ చెప్పింది. ఇదిలా ఉండగా కత్రినా నటించిన ‘ఫోన్ భూత్’ రీసెంట్ గా రిలీజైంది. ప్రస్తుతం క్రిస్ మస్, టైగర్ 3 చిత్రాల్లో నటిస్తోంది. ఆమె భర్త విక్కీ కౌశల్.. సామ్ బహదూర్, గోవిందా నామ్ మేరా సినిమాలతో బిజీగా ఉన్నాడు.