భారీ బడ్జెట్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ రకమైన హైప్ ఉంటుంది. అలాంటి చిత్రాల్ని వెండితైరపై మాత్రమే చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఒకవేళ అవి క్లిక్ అయితే వందలకోట్లు వచ్చిపడటం ఖాయం. తేడా కొట్టేస్తే మాత్రం అవే వందలకోట్ల నష్టం, ఎన్నో ఏళ్ల శ్రమ వృథా అవుతుంది. ఇప్పుడు సేమ్ అదే విషయాన్ని చెబుతున్న కంగన.. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాపై ఫుల్ ఫైరవుతుంది. వందల కోట్ల తగలబెట్టేశారని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసింది. ఇన్ స్టా స్టోరీలో వరస పోస్టులు పెట్టింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో దీనిని దర్శకుడు రాజమౌళి సమర్పణలో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. కొందరు వీఎఫ్ఎక్స్ తో పాటు చిత్రం బాగుందని మెచ్చుకుంటుంటే.. మరికొందరు బాలేదని ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వాటికి ఆజ్యం పోస్తూ హీరోయిన్ కంగన షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇన్ స్టాలో వరస పోస్టులు పెట్టింది.
‘దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ.600 కోట్లు తగలబెట్టేశాడు. అతడు జీవితంలో ఒక్క మంచి సినిమా కూడా తీయలేదు. ఇక కరణ్ జోహార్ అయితే తన సినిమా స్క్రిప్టుల కంటే ప్రతి ఒక్కరి శృంగార జీవితంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. నకిలీ కలెక్షన్స్, ఫేక్ రివ్యూలు కొనుగోలు చేస్తాడు. హిందూ మతాన్ని, సౌత్ వేవ్ ని తొక్కే ప్రయత్నం చేశాడు. ‘బ్రహ్మాస్త్ర’ బడ్జెట్ సమకూర్చుకోవడానికి ఫాక్స్ స్టూడియోస్ తనంతట తాను అమ్ముకోవాల్సి వచ్చింది. ఇలాంటి సినిమాల వల్ల ఇంకెన్నిస్టూడియోస్ మూతపడతాయో? అయాన్.. ఈ సినిమా తీయడానికి 12 ఏళ్లు తీసుకున్నాడు. 400 రోజులకు పైగా షూట్ చేసి, 14 మంది డీఓపీలను, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లని మార్చి రూ.600 కోట్లు కాల్చి బూడిద చేశాడు’ అని కంగన ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘బ్రహ్మాస్త్ర’ మూవీని కంగన టార్గెట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: రికార్డులు తిరగరాసిన బ్రహ్మాస్త్ర.. మొదటి రోజే భారీ కలెక్షన్లు!