తన మాటల తూటాలతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది నటి కంగనా రనౌత్. సినీ ఇండస్ట్రీలో క్వీన్‌గా ఎదిగిన ఆమె.. సమాజంలో జరిగే విషయాలపై ఎప్పటికప్పుడు తనశైలిలో స్పందిస్తుంటుంది. అవతలి వ్యక్తి ఎవరైనా సరే.. ఎలాంటి బెరుకు లేకుండా సోషల్ మీడియాలో కడిగిపారేస్తుంటుంది కంగనా. సినిమాల కన్నా కూడా.. ఆమె చేసిన వ్యాఖ్యలపైనే ఎక్కువ చర్చలు జరుగుతుంటాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది కంగనా. తాజాగా ఆమె నటించిన ధాకడ్ సినిమా శుక్రవారం విడుదలయ్యింది. పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఈ చిత్రంలో ఆమె ఏజెంట్ అగ్ని అనే గూడఛారి పాత్ర పోషించింది. ఇక సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందు కంగనా కాస్ట్‌లీ కారు కొనుగోలు చేసింది.
ధాకడ్ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా కొత్తగా కొనుగోలు చేసిన కార్‌ని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది కంగనా. ఆమె కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ మేబాక్ ఎస్680 మోడల్ కంపెనీ చెందినది కాగా.. దీని ఖరీదు రూ.3.6 కోట్లు అని సమాచారం. రీసెంట్‌గా ఈ కారు భారత్‌లో లాంచ్ అవ్వగా.. ఈ కారును మొదట కొనుగోలు చేసి ఇండియన్‌గా కంగనా నిలిచింది. కంపెనీ ప్రతినిధులు కొత్త కారు తాళలను కంగనాకు అందజేయగా.. ఆమె తల్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక కంగనా లేటెస్ట్ మూవీ ‘ధాకడ్’ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో కంగనా ఏజెంట్ అగ్ని అనే గూఢచారి క్యారెక్టర్‌ను పోషించింది. కంగనా నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.