బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, వివాదాల బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలో ఏం జరిగినా వెంటనే దానిపై తనదైన తనదైన స్టైల్లో ఎలాంటి భయం లేకుండా విమర్శలను సంధిస్తుంటుంది. ఇండస్ట్రీ, రాజకీయాలు విషయం ఏదైనా తన మాటల తూటాలతో సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరో ఖరీదైన కారు కొనగోలు చేసింది.
కంగనా రౌనత్ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ మేబాక్ ఎస్680 మోడల్.. దీని ఖరీదు రూ.3.6 కోట్లు. తాను నటించిన ధాకడ్ మూవీ ప్రీమియం షోకి తన కుటుంబ సభ్యులతో ఈ కారులో వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తల్లి కొత్త కారుకి పూజాలు చేసింది. మార్కెట్ లోకి కొత్త కారు వస్తే తనకు నచ్చితే వెంటనే కొనగోలు చేయడం కంగనాకు అలవాటు. ఈ క్రమంలోనే మెర్సిడెస్ మేబాక్ ఎస్680 మోడల్ కొనుగోలు చేసింది.
కంగనాకు కార్లు మాత్రమే కాదు.. యాక్సెసరీస్ అంటే కూడా చాలా ఇష్టం. చాలా వరకు కంగనా వద్ద ఉన్న కలెక్షన్లలో చాలా లగ్జరీ, సూపర్ ఎక్స్‌పెన్సివ్ హ్యాండ్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇందులో 3 హీర్మేస్ బిర్కిన్ హ్యాండ్‌బ్యాగ్‌లు కంగనా వద్ద ఉన్నాయి. కల్లు చెదిరే విధంగా ఒక్కో దానికి రూ. 15 లక్షల వెచ్చించినట్లు సమాచారం. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Parents: ఆస్తి ముద్దు.. అమ్మనాన్నలు వద్దు! బయటకి గెంటేసిన కుమారులు!