మనోయజ్ఞం సీరియల్ గుర్తులేని నైన్‌టీస్ కిడ్స్ ఉండరు అంటే అందులో అతిశయోక్తి లేదు. అందులో ప్రధాన పాత్రలో కనిపించిన రాజ్‌కుమార్‌కు సూపర్ క్రేజ్ ఉండేది. ఒకనొక టైంలో ఆయన సినిమాల్లో కూడా స్టార్‌గా వెలుగొందారు.
రాజ్ కుమార్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో పెద్ద పరిచయం అక్కర్లేదు. దాదాపు 30 ఏళ్ల సినిమా జీవితంలో పదుల సంఖ్యలో సినిమాలు, పలు సీరియళ్లలో నటించారాయన. జూనియర్ చిరంజీవిగా బాగా పాపులర్ అయ్యారు. అయితే, సినిమాల్లో ఆశించినంత స్థాయిని చేరుకోలేకపోయారు. తర్వాతి కాలంలో సీరియళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. అరుదుగా సినిమాల్లో కనిపిస్తూ ఉండేవారు. గత కొన్నేళ్లనుంచి సినిమాలు, సీరియళ్లు రెండిటికి దూరం అయ్యారు. ఇంటికే పరిమితం అయ్యారు. అలాంటి ఆయన చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు.
ప్రముఖ డిజిటల్ టీవీ సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కెరీర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ సోషల్ మీడియాలో ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. మంచి ఫేమస్ ఛానల్‌లో రావటం నిజంగా నాకు సంతోషంగా ఉంది. 1989 డిసెంబర్ 6 తారీఖున మద్రాస్లో కాలుపెట్టాను. ఆ సినిమా విడుదలైన తర్వాత ఓవర్ నైట్‌కు పది సినిమాలు వచ్చేశాయి. నా సాంగ్‌కు విజిల్స్ కొట్టడం అనేది నాకు ఏమీ అర్థం కాలేదు. నా కళ్లలో నీళ్లు వచ్చేశాయి. సొంతంగా నేను సినిమా చేయటం నేను చేసిన మిస్టేక్. స్టార్‌డమ్ లేకపోతే సినిమాలు చేయటం అనేది వేస్ట్ అనేది నా అభిప్రాయం.
అనుకోకుండా ఆ సినిమా కూడా ప్లాప్ అయింది. పేపర్‌లో చిరంజీవి గారి ఫొటో వస్తే.. రెండో పేజీలోనో.. మూడో పేజీలోనో నా ఫొటో ఒకటి వస్తుంది. ఆయన దిగ్గజం.. శిఖరం. మర్రి చెట్టుకింద కలుపు మొక్కలా అయిపోయింది. కొంతమంది ‘ మిమ్మల్ని తొక్కేసారు సార్ అందరూ కలిసి’ అన్నారు. తొక్కేవాళ్లు అయితే టీవీలో కూడా రానివ్వరు అన్నాను. చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవటం సంతోషంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు. మరి, రాజ్ కుమార్ సినీ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.