వీరసింహారెడ్డి.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పేరు ట్రెండ్ అవుతోంది. బాలయ్య- గోపిచంద్ మలినేని కాంబోలో వస్తున్న సినిమమాకి బాగా బజ్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన జై బాలయ్య, సుగుణా సుందరి, మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే పాటలు యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ కూడా జనవరి 6 రాత్రి 8.17 గంటలకు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరీ ముఖ్యంగా మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే సాంగ్ తెగ వైరల్ అవుతోంది. అందుకు కారణం లేకపోలేదు.
అలనాటి అందాల తార, డాన్సింగ్ క్వీన్ జయమాలిని ఈ సాంగ్ కు స్టెప్పులేయడమే.తాజాగా సుమన్ టీవీ జయమాలినిని ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంగా యాంకర్ రోషన్ తో కలిసి జయమాలిని కాలు కదిపింది. ఇద్దరూ కలిసి వీర సింహారెడ్డి సినిమాలోని మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే సాంగ్ కు స్టెప్పులేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికీ జయమాలినీ స్టెప్పుల్లో గ్రేస్, ఆవిడలో స్వాగ్ తగ్గలేదంటూ అభిమానులు కితాబిస్తున్నారు. ఆ రోజుల్లో ఏ జోష్ అయితే ఉండేదో.. ఇప్పుడు కూడా అదే జోష్ తో స్టెప్పులేశారు.
ఇంక జయమాలిని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలయ్య వంటి అగ్ర హీరోల సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలకు స్టెప్పులేశారు. హీరో, హీరోయిన్లకు మించి ఆవిడకు అభిమానుల ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఉండేది. చాలాకాలం తర్వాత జయమాలిని కెమెరా ముందుకు రాగానే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో జయమాలిని డాన్స్ వీడియో వైరల్ అవుతోంది.