అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది జాన్వీ కపూర్. నాలుగేళ్లుగా సినిమాలైతే చేస్తోంది.. కానీ, ఇంకా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో దాదాపు రెండు కోట్లకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన జాన్వీ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో రచ్చ లేపుతోంది. కెరీర్ కి సంబంధించి అప్ డేట్స్ కంటే గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేయడానికే జాన్వీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. తాజాగా జాన్వీ పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు చూసి అభిమానులు, నెటిజన్స్ కన్నుల పండుగ చేసుకుంటున్నారు.
అసలే జాన్వీ కపూర్ ఫాలోయింగ్ కోట్లలో ఉంది కాబట్టి.. ఎప్పుడెప్పుడు ఆమె ఫోటోలు పోస్ట్ చేస్తుందా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఏకంగా బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తే ఊరుకుంటారా.. పోస్ట్ చేసిన కొద్దీ నిమిషాల్లోనే ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. అలాగే జాన్వీ అందాలను పొగుడుతూ.. కామెంట్స్ లో తమ మనోభావాలను బయట పెడుతున్నారు ఫ్యాన్స్. అయితే.. రీసెంట్ గా జాన్వీ మాల్దీవ్స్ కి టూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. బికినీ పిక్స్ తో పాటు స్విమ్ సూట్ లో కూడా మతిపోయే అందాలు షో చేసింది జాన్వీ. ఇటీవల గుడ్ లక్ జెర్రీ, మిలి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. ప్రస్తుతం బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలు చేస్తోంది.
ప్రెజెంట్ వెకేషన్ లో ఉన్న జాన్వీ.. ఉదయం లేచిన దగ్గర నుండి జిమ్ వర్కౌట్స్ తో సహా పిక్స్ పోస్ట్ చేసింది. అలా డే స్టార్ట్ చేసి.. తర్వాత బ్రేక్ ఫాస్ట్.. ఇక డైరెక్ట్ బీచ్ లో అందాల ప్రదర్శన మొదలు పెట్టింది. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లి.. కూల్ కూల్ గా స్విమ్ సూట్ లో హాట్ నెస్ తో కుర్రకారులో సెగలు రేపింది. ఇదిలా ఉండగా.. కొంతకాలంగా జాన్వీ టాలీవుడ్ డెబ్యూ చేయనుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ముందుగా ఎన్టీఆర్ సినిమాలో అన్నారు.. ఇప్పుడేమో రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమాలో అని టాక్ నడుస్తుంది. మరి ఇంతకీ ఎవరి సరసన డెబ్యూ చేయనుందో చూడాలి.
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.