సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలంతా అన్ని విషయాలను అందులోనే షేర్ చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలు, గృహప్రవేశాలు, బర్త్ డేలు ఇలా అన్ని సెలబ్రేషన్స్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. తాజాగా నటి, మంత్రి రోజా తన 50వ పుట్టినరోజు ఫ్రెండ్స్ తో కలిసి జరుపుకుంది. బర్త్ డే సందర్భంగా ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. ఆ తర్వాత ఇంట్లో తన ఫ్రెండ్స్, సన్నిహితుల మధ్య ఫ్రూట్స్ తో బర్త్ డే జరుపుకుందట. ప్రస్తుతం రోజా ఫ్రూట్స్ తో బర్త్ డే జరుపుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో రోజా బర్త్ డే వీడియోలో ఆమెతో పాటు జబర్దస్త్ వర్ష, సీరియల్ నటి నటకుమారి సందడి చేయడం గమనార్హం. ఉదయం తిరుమల దర్శనంలో కూడా జబర్దస్త్ వర్ష రోజాతో కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. జబర్దస్త్ లో రోజా జడ్జిగా ఉన్నప్పుడు స్కిట్స్ చేసే టైమ్ లో వర్షతో మంచి బాండింగ్ ఏర్పడిందని సమాచారం. అప్పటినుండి రోజా.. వర్షను స్పెషల్ గా ట్రీట్ చేస్తుందట. రోజా ఎప్పుడు టీవీ షోలలో హాజరైనా.. వర్ష దగ్గరుండి చూసుకుంటుందట. మరోవైపు రోజా.. ఏపీ టూరిజం శాఖ మంత్రిగా రాజకీయాలలో తన హవా కొనసాగిస్తోంది.
ఇక ప్రస్తుతం రోజా బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో వైరల్ అవుతుండగా.. పక్కనే ఉన్న జబర్దస్త్ వర్ష సందడి చేయడం వీడియోలో చూడవచ్చు. అలాగే ఇద్దరు ఒకరికొకరు ఫ్రూట్స్ తినిపించుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా.. రోజా తెలుగుతో పాటు తమిళంలో గ్లామరస్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న విషయం విదితమే. దక్షిణాది స్టార్స్ అందరి సరసన సూపర్ హిట్స్ చేసిన రోజా.. ఆ తర్వాత యంగ్ హీరోలకు మదర్ రోల్స్ కూడా చేసింది. కొన్నాళ్లపాటు జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరించి.. ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోయింది. తాజాగా 50వ పుట్టినరోజును రోజా సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.