అనసూయ.. తెలుగు బుల్లితెరకి గ్లామర్ ని పరిచయం చేసిన లేడీ యాంకర్. పెళ్లి అయ్యి.., ఇద్దరు పిల్లలు ఉన్నా.., అనసూయ అందంలో మాత్రం ఈనాటికీ అదరగొడుతుంది. ఇక జబర్దస్త్ లో ఈ యాంకరమ్మ అందానికి ఫిదా అయిపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.., అనసూయ వేసుకునే డ్రెస్ ల విషయంలో మాత్రం ఆన్లైన్ లో ఇప్పుడూ ట్రోల్స్ నడుస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఈ విషయంలో అనసూయ చాలాసార్లు హార్ట్ అయ్యింది. ఒకానొక సమయంలో సోషల్ మీడియాకి సైతం దూరం అయిపోయింది. కాగా.., ఈ స్టార్ లేడీ యాంకర్ కి తాజాగా జబర్దస్త్ సెట్ పై ఇలాంటి ఇబ్బందికర ప్రశ్నలే ఎదురయాయ్యి. ఆ వివరాల్లోకి వెళ్తే… జబర్దస్త్ లో హైపర్ ఆది టీమ్ కి ఉండే ఫాలోయింగ్ వేరు. ఎప్పటికప్పుడు సరికొత్త గెట్స్ ని తీసుకొచ్చి వారి ద్వారా నవ్వులు పూయించడం ఆదికి అలవాటు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఆది టీమ్ లో కొత్త గెస్ట్ కనిపించాడు. అతనే యాంకర్ శివ. తన ఇంటర్వూస్ తో గెస్ట్ లను ఇబ్బంది పెట్టే శివ తాజాగా జబర్దస్త్ సెట్ పైనే అనసూయని కూడా ఇబ్బంది పెట్టాలని చూశాడు.
ముందుగా అది స్కిట్ లో నామ మాత్రంగా కనిపించాడు శివ. కానీ.., ప్రోమో లాస్ట్ లో మాత్రం తనకి అలవాటైన రీతిలో ప్రశ్నలతో అనసూయని ఇరకాటంలో పెట్టేశాడు. అనసూయ గారు పొట్టి బట్టలు ఎందుకు వేసుకుంటారు? బయట అందరూ ఇలానే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా ఎప్పటి నుండో ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నా అంటూ రచ్చ మొదలుపెట్టాడు శివ. దానికి అనసూయ… బయట వాళ్ళు అన్నారంటే ఇండస్ట్రీ గురించి తెలియదని అనుకోవచ్చు. కానీ మీరు అడగడం ఏంటి? ఇది నా వ్యక్తిగతమని బదులిచ్చింది. కానీ.., శివ మాత్రం అక్కడితో ఆగిపోలేదు. మీ పర్సనల్ అయితే మీ ఇంట్లో చేసుకోవచ్చు కదా? ఇక్కడ ఎందుకు? అంటూ కౌంటర్ వేశాడు. ఇక దీంతో ఖంగుతిన్న అనసూయ ఆదిపై ఫైర్ అయ్యింది. ఎవరెవరినో తీసుకొచ్చి.., ఇలాంటి ప్రశ్నలు అడిగిస్తారా? నీకు తెలియకుండానే ఇలా అడగతారా? అంటూ ఆది పై ఫైర్ అవుతూ స్టేజ్ దిగి బయటకి వెళ్లిపోయింది. మిగతా కంటెస్టెంట్స్ అంతా అనసూయని బుజ్జగిస్తుండగా ప్రోమో ఎండ్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రోమో వైరల్ అవుతోంది.