Faima: సాధారణంగా కామెడీ టైమింగ్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరి శైలిలో వారు కామెడీ పండిస్తుంటారు. అయితే.. కొంతమంది మాత్రం అనూహ్యంగా ఆఫర్స్ అందుకుంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి క్రేజ్ దక్కించుకుంటారు. తాజాగా ఇలాంటి టాలెంటెడ్ లిస్టులో చేరింది జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా. పటాస్ ప్రోగ్రాంతో కెరీర్ ప్రారంభించిన ఫైమా.. ఆ తర్వాత పోవే పోరాలో చేసింది. ఇప్పుడు జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీమ్ లో స్కిట్స్ చేస్తోంది.
ప్రస్తుతం ఫైమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టయిల్ లో.. బేస్ వాయిస్ తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫైమా తన కెరీర్, ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఫైమా మాట్లాడుతూ.. ‘నా కాలేజీ టైంలో పటాస్ షో వచ్చేది. మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు. మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా సార్ నన్ను కాలేజీ ట్రిప్ అని చెప్పి.. పటాస్ షో చూసేందుకు తీసుకువచ్చారు.
ఆ విధంగా నేను పటాస్ లోకి వచ్చాను. నేను మాట్లాడే విధానం.. యాస డైరెక్టర్లకు నచ్చింది. వాళ్లు ఆఫర్ ఇచ్చినా.. మా ఇంట్లో చెబితే ఒప్పుకోలేదు. అప్పుడే నేను చచ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేస్తే ఒప్పుకున్నారు. అయితే.. ఒకప్పుడు మా ఊరికి ఎవరైనా వస్తే నేను ఫోటోలు దిగేందుకు పరిగెత్తేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఊరెళ్తే.. నాతో ఫొటోలు దిగేందుకు చాలామంది వస్తున్నారు. నేను మా వాళ్ళు మా చాలా హ్యాపీ.
ఇక జబర్దస్త్ విషయానికి వస్తే.. బుల్లెట్ భాస్కర్ అన్ననే నాకు అన్నీ. గురువులాగా, తండ్రిలాగా ఎంతో ఓపిగ్గా అన్ని నేర్పిస్తాడు. ఎప్పుడైనా డల్ కనిపిస్తే.. ఏదోకటి చెప్పి నవ్విస్తాడు. ఇక్కడ అందరం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటాం. పటాస్ షో ముగిసిన తర్వాత జీవన్ అన్న టీమ్‌లో చేశా. అక్కడ పెద్దగా పేరు రాలేదు. భాస్కర్ అన్న టీమ్ లో చేరాక నా లైఫ్ టర్న్ అయ్యింది. అప్పటి నుండి అసలు జర్నీ మొదలైంది. నేను ఇంట్లో మాట్లాడే విధానమే.. స్కిట్ లో మాట్లాడాలని భాస్కర్ అన్న ప్రోత్సహించారు. ప్రస్తుతం సినిమాల్లో ఆఫర్లు వచ్చినా చేయట్లేదు. జబర్దస్త్ లోనే చేస్తున్నా. భవిష్యత్ లో సినిమాలు చేస్తా” అని చెప్పుకొచ్చింది. మరి ప్రస్తుతం ఫైమా క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. మరి ఫైమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.