సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న సినిమా ఏదైనా ఉందంటే అది ‘విక్రమ్’ చెప్పాలి. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు. అయితే.. సినిమా విడుదలైనప్పటి దీని గురించి ప్రేక్షకులు మాత్రమే కాదు, దర్శకనిర్మాతలు సైతం గొప్పగా మాట్లాడుతున్నారు. అలాగే డైరెక్టర్ లోకేష్ తెరకెక్కించిన విధానం, టేకింగ్ లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటివరకూ డైరెక్టర్ లోకేష్ చేసింది నాలుగు సినిమాలే. అందులో ఖైదీ, మాస్టర్ సినిమాలు బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు అదే వరుసలో విక్రమ్ కూడా చేరింది.
దీంతో లోకేష్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడనే విషయం సినీవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే విక్రమ్ తర్వాత విక్రమ్-2 లేదా ఖైదీ-2 ఉండొచ్చని హింట్ ఇచ్చాడు లోకేష్. అప్పటినుండి లోకేష్ ఏది ముందు చేయనున్నాడు? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే.. కార్తీతో తీసిన ఖైదీ స్టోరీని విక్రమ్ లో కంటిన్యూ చేసిన లోకేష్.. చివరిలో రోలెక్స్ క్యారెక్టర్ తో సూర్యను కథలో భాగం చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే లోకేష్ నుండి నెక్స్ట్ విక్రమ్ 2, ఖైదీ 2 ఏది వచ్చినా అందులో రోలెక్స్ కూడా కనిపించనున్నాడు.
ఇక ఇప్పుడు విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న లోకేష్.. ప్రస్తుతానికి దళపతి విజయ్ తో ఓ సినిమా చేయనున్నాడు. మరి విజయ్ తో ఇదివరకు మాస్టర్ చేసిన లోకేష్.. ఇప్పుడు మాస్టర్ కి సీక్వెల్ చేస్తాడా లేక కొత్త స్టోరీతో చేస్తాడా.. లేదా విక్రమ్ యూనివర్స్ లోకి తీసుకొస్తాడా అనేది చూడాలి. ఈ క్రమంలో విక్రమ్ సక్సెస్ లో భాగంగా కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ లను ఇంటికి పిలిచిమరీ అభినందించాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే.. కమల్, లోకేష్ లను మెగాస్టార్ ఇంటికి పిలవడంపై సినీ ఇండస్ట్రీలో పలు చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటివరకూ తమిళ హీరోలతో లోకేష్ యూనివర్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో పార్ట్ లో కొత్త పాత్రతో ఒక్కో స్టార్ హీరో యాడ్ అవుతూ వస్తున్నారు. మరిప్పుడు లోకేష్ యూనివర్స్ లోకి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేరబోతున్నాడా? మెగాస్టార్ తో లోకేష్ మీటింగ్ వెనుక కారణం ఇదేనా? అంటే.. అవుననే అంటున్నాయి సినీవర్గాలు. ఇదివరకే రామ్ చరణ్ ని లోకేష్ కలిసినట్లు పలు వార్తలు బయటికి వచ్చాయి. అందులోనూ ఇప్పుడు లోకేష్ ఇంటికెళ్లి మరీ మెగాస్టార్ ని కలవడంతో చరణ్ తో సినిమా కన్ఫర్మ్ అయ్యిందనే వార్తలకు బలం చేకూరినట్లయింది.
The strong buzz in film circles is that #RRR ‘s Hero #RamCharan is going to team up with the latest #Vikram Sensation @Dir_Lokesh
Details will be out at the end of the year. One big production house from Telugu & one from Tamil will join to make this project.
— South Scopes™ (@ScopesSouth) June 9, 2022
డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇప్పుడున్న ఫామ్ కి, స్పీడ్ కి ఏ హీరోని కదిలించినా కథ అడగకుండా ఓకే చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటిది లోకేష్ దర్శకత్వంలో మెగాహీరో రామ్ చరణ్ తో సినిమా ఎలా ఉండబోతోందనే చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ రామ్ చరణ్ తో సినిమా కన్ఫర్మ్ అయినట్లయితే.. చరణ్ ని కూడా కొత్త క్యారెక్టర్ తో లోకేష్ యూనివర్స్ లో యాడ్ చేస్తాడా? లేదా సపరేట్ సినిమా ప్లాన్ చేస్తాడా? అనేది ఆసక్తిరేపుతున్న విషయం. అదీగాక లోకేష్ యూనివర్స్ లో ఓ తెలుగు స్టార్ హీరో కూడా చేరితే.. తెలుగులో లోకేష్ సినిమాకు మార్కెట్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు.
ప్రస్తుతం లోకేష్ దళపతి విజయ్ సినిమా పూర్తిచేసి, ఆ తర్వాత ఖైదీ 2 లేదా విక్రమ్ 2 మొదలుపెడతాడని తమిళ వర్గాలు చెబుతున్నాయి. ఈ రకంగా చూసుకుంటే.. రామ్ చరణ్ ని ఓ పవర్ ఫుల్ పాత్ర ద్వారా తన మల్టీవర్స్ లో జాయిన్ చేస్తాడని బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో పాటు గౌతమ్ తిన్ననూరి సినిమాను లైనప్ చేశాడు. ఒకవేళ చరణ్ తో లోకేష్ సపరేట్ స్క్రిప్ట్ ప్లాన్ చేస్తే.. మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని.. అందుకే తన యూనివర్స్ లో పవర్ ఫుల్ రోల్ ద్వారా చరణ్ ఎంట్రీ ఇస్తాడేమోనని ఇండస్ట్రీ టాక్. మరి లోకేష్ కనకరాజ్ – రామ్ చరణ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Absolute joy,celebrating & honouring my dearest old friend @ikamalhaasan for the spectacular success of #Vikram along with my dearest Sallu Bhai @BeingSalmanKhan @Dir_Lokesh & team at my home last night.What an intense & thrilling film it is!!Kudos My friend!! More Power to you! pic.twitter.com/0ovPFK20r4
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2022
Make it Man @Dir_Lokesh With @AlwaysRamCharan Anna 🔥#ManOfMassesRamCharan pic.twitter.com/pqsXNehJED
— vipul lohar (@vipullohar19) June 5, 2022