Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలను, ఇటు సినిమాలను సమానంగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన పవన్ చేతిలో ఇప్పుడైతే.. క్రిష్ తో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’, సముద్రఖనితో ‘వినోదయ సితం’ తెలుగు రీమేక్ సినిమాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలను పూర్తి చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.
ఇక ఇప్పుడున్న సినిమాలే కాకుండా ఇటీవల మరో దర్శకుడితో కథాచర్చలు జరిపినట్లు వార్తలు బయటికి వచ్చాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. సాయిపల్లవి, రానాలతో ‘విరాట పర్వం’ తెరకెక్కించిన వేణు ఊడుగుల. ఈ యువదర్శకుడు విరాట పర్వం విడుదలకు ముందే పవన్ ని కలిసి ఓ కథ వినిపించాడని, దానికి పవన్ కూడా పచ్చజెండా ఊపినట్లు సినీవర్గాలలో టాక్ నడిచింది.
పవన్ కి ఒకసారి దర్శకుడి పనితనం నచ్చితే చాలు.. కలెక్షన్స్, ట్రాక్ రికార్డు చూడకుండా అవకాశం ఇస్తాడని అంటుంటారు. అయితే.. ఇప్పుడు పవన్ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే.. ఇప్పట్లో కొత్త సినిమాలేవీ ఓకే చేసేలా లేడట. ఎందుకంటే.. జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్.. అక్టోబర్ నుండి పొలిటికల్ టూర్ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఓవైపు మూడు సినిమాలు చేతిలో ఉండగా.. పొలిటికల్ టూర్ అంటే.. దాదాపు కొత్త సినిమాలకు స్కోప్ లేనట్లే అని ఇండస్ట్రీ టాక్.
అదీగాక పొలిటికల్ టూర్ ప్రారంభానికి ఇంకా మూడు నెలలే టైం ఉంది. పవన్ చేతిలో ఉన్నసినిమాలను సమయానికి పూర్తి చేస్తాడా..? లేదా అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ప్రస్తుత మూడు సినిమాలు కాకుండా కొత్తగా వేణు సినిమా అంటే.. దాదాపు ఉండదనే అంటున్నాయి సినీవర్గాలు. ఒకవేళ పొలిటికల్ టూర్ తర్వాత అవకాశం ఉంటుందేమో చూడాలి. మరి పవన్ – వేణు కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
I don’t comment now…but working with @PawanKalyan is my dream, one day I ll definitely work with him – Venu Udugula in @Clubhouse
— McDowell Reddy (@mcdowellmurthy2) July 20, 2021
Power Star Pawan Kalyan likely to team up with Venu Udugula; script in workinghttps://t.co/tuxHaiifNr pic.twitter.com/txq2ImRUlx
— idlebrain.com (@idlebraindotcom) April 3, 2022