సినిమాల కన్నా.. సీరియల్స్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలో సీరియల్స్ హవా కొనసాగుతోంది. ఇక ఒక భాషలో ఏదైనా సీరియల్ హిట్ అయితే.. తప్పకుండా అది మిగతా భాషల్లోకి రీమేక్ అవుతుంది. ఈ కోవకు చెందిన సీరియలే కార్తీక దీపం. మలయాళంలో ప్రసారం అవుతున్న కరుతముతూ సీరియల్ ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు. స్టార్ మాటీవీలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా టీఆర్పీ రేటింగుల్లో ప్రథమ స్థానంలో కొనసాగుతూ వస్తోంది ఈ సీరియల్. దీనిలో నిరుపమ్ పరిటాల.. డాక్టర్ కార్తీక్ క్యారెక్టర్ చేస్తుండగా.. దీప అలియాస్ వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ నటించారు. ఇక దీపకు హీరోయిన్లను ఏమాత్రం తీసిపోని ఫాలోయింగ్ ఉంది.
ఇది కూడా చదవండి: బుల్లితెరను దాటేస్తున్నవంటలక్క…యువ హీరో సినిమాలో ఛాన్స్
ఇక సీరియల్ విషయానికి వస్తే.. ముందు చూపించినట్లుగానే దీప, కార్తీక్ లు కారు ప్రమాదంలో మరణిస్తారు. వారి పిల్లల క్యారెక్టర్లు మాత్రమే మిగిలి ఉంటాయి. వంటలక్క, డాక్టర్ బాబు చనిపోతే.. ఇక సీరియల్ ఏం ఉంటుంది… శుభం కార్డు పడాల్సిందే అనుకున్నారు. గత కొన్ని రోజులుగా ప్రోమోలో చూపిన విధంగానే సీరియల్లో వంటలక్క, డాక్టర్ బాబు మృతి చెందినట్లు చూపించారు. సో ఇక సీరియల్ అయిపోయినట్లే అని అంతా భావించారు. ఇక సీరియల్లో కీలక పాత్ర పోషిస్తున్న శోభాశెట్టి అలియాస్ మోనిత కూడా సీరియల్ అయిపోయింది అని క్లారిటీ ఇచ్చేసింది. తన యూట్యూబ్ చానెల్లో కార్తీక దీపం లాస్ట్ ఎపిసోడ్ షూటింగ్‌కి సంబంధించిన వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కార్తీక దీపం అభిమానులు.. అయ్యో సీరియల్ అప్పుడే అయిపోతుందా అని బాధపడుతున్నారు.
ఇది కూడా చదవండి: కార్తీకదీపం దీపం సీరియల్ ప్రేక్షకులకి బ్యాడ్ న్యూస్!
ఇక శోభా శెట్టి షేర్ చేసిన ఈ వీడియోలో కార్తీక దీపం ఈ జనరేషన్ అయిపోతుందంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఇకపై సీరియల్లో తన పాత్ర కనిపించదని కూడా పేర్కొంది. తరువాత జనరేషన్ అంటే దీప-కార్తీక్ పిల్లల క్యారెక్టర్, సౌందర్య పాత్రలతో సీరియల్ కొనసాగుతుందని తెలిపింది. సీరియల్ అయిపోతుందేమో అని బాధపడుతున్న కార్తీకదీపం అభిమానులకు.. మోనిత షేర్ చేసిన వీడియోతో క్లారిటీ వచ్చింది. గత ఆరేళ్లుగా కొనసాగుతున్న సీరియల్ లో శోభాశెట్టి క్యారెక్టర్ కి శుభం కార్డ్ పడింది.. సీరియల్ కి కాదని ఈ వీడియోతో ఒక స్పష్టత వచ్చింది. హిమ క్యారెక్టర్ మెయిన్ అని వీడియో ఆఖర్లో చెప్పిన మోనిత మాటలు గమనిస్తే…పెద్దదనై హిమ క్యారెక్టర్లో దీప( ప్రేమీ విశ్వనాథ్) ఎంట్రీ ఇస్తుందని.. అలానే కార్తీక్ మేనళ్లుల్లో ఒకరి క్యారెక్టర్ లో డాక్టర్ బాబు తిరిగి రీఎంట్రీ ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.