ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నవారిలో శంకర్ ఒకరు. పేరుకు తమిళ దర్శకుడే అయినప్పటికీ, దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. మొదటి నుండి భారీ బడ్జెట్ తో సామాజిక అంశాలపై సినిమాలు తీసే శంకర్.. ప్రస్తుతం రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నాడు. ఒకటి విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు 2’ కాగా.. రెండోది మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ‘RC15’ సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు 2023లో రిలీజ్ అవుతాయని తెలుస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత శంకర్ తదుపరి సినిమాపై ఓ వార్త సినీవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.
సౌత్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ శంకర్. ఇప్పటివరకు దాదాపు 500 కోట్ల బడ్జెట్ లో సినిమాలు రూపొందించాడు. కానీ.. ఇండియన్ 2, RC15 సినిమాల తర్వాత శంకర్ పట్టాలెక్కించే తదుపరి ప్రాజెక్ట్ బడ్జెట్ ఇంతవరకు ఎవరూ ఊహించని రేంజిలో ఉండబోతుందట. అయితే.. శంకర్ నెక్స్ట్ మూవీ కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఉండబోతుందని.. ఆ సినిమాను ఓ బడా నిర్మాణ సంస్థ సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో శంకర్ ను నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాతలు కూడా ఉన్నారా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే.. శంకర్ ప్రస్తుతం ఫామ్ లో లేకపోవడమే అంటున్నారు.
రోబో సినిమాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన శంకర్.. ఆ తర్వాత స్నేహితుడు, ఐ, రోబో 2 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయి సందడి చేయలేకపోయాడు. అందులోనూ వందల కోట్ల బడ్జెట్ సినిమాలంటే రిస్క్ ఎక్కువ. ప్రేక్షకులకు సినిమా నచ్చితే ఓకే.. ఒకవేళ ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయినా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అంతా నష్టపోవాల్సి వస్తుంది. సో.. సూర్యతో శంకర్ సినిమా ఉంటుందా లేదా తెలియదు. కానీ.. వీరి కాంబినేషన్ లో రాబోయే సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారంటే.. నమ్మశక్యంగా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పటికైతే శంకర్, సూర్య కాంబినేషన్ పై అధికారిక ప్రకటన బయటికి రాలేదు.
ఇదిలా ఉండగా.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్న రాజమౌళి కూడా 500 బడ్జెట్ దాటి సినిమాలు తీయలేదు. అలాంటిది ప్లాప్ లో ఉన్న శంకర్ ని నమ్మి వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాతలు ఎవరున్నారు? వాళ్ళకి దండం పెట్టాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాలలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం పక్కన పెడితే.. శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2(భారతీయుడు 2), RC15 సినిమాలపై మాత్రం ఫ్యాన్స్ లో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. మరి దర్శకుడు శంకర్ బడ్జెట్ పై, ఆయన తీసే సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Suriya and #Shankar combo to join for the first time 👌💥
Adoption of a famous novel #Velpari 🤩
Story work has already started by #SuVenkatesan !!
Going to be the next magnum opus movie from Kollywood after #PonniyinSelvan 🔥🔥
Budget – 1000cr 🤯 pic.twitter.com/8QsCcECPbW— AmuthaBharathi (@CinemaWithAB) September 9, 2022