సోషల్ మీడియా స్టార్ నుండి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్నవారు చాలామంది ఉన్నారు. కానీ మిలియన్ పైగా ఫాలోయర్స్ కలిగిన యూట్యూబ్ సెలబ్రిటీలలో దీప్తి సునైనా ఒకరు. సోషల్ మీడియాలో దీప్తి సునైనా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లో మిలియన్ల ఫ్యాన్స్ తో సినీ స్టార్స్ తో సమానంగా క్రేజ్ మెయింటైన్ చేస్తోంది.
సోషల్ మీడియాలో పాపులర్ అయినవారంతా ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి అడుగు పెట్టేద్దాం.. అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ దీప్తి అలా చేయకుండా యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, ఇంస్టాగ్రామ్ వీడియోస్ వరకే పరిమితమై ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే.. దీప్తి లవ్ మేటర్ గురించి అందరికి తెలిసిందే. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ కూడా బిగ్ బాస్ ద్వారానే టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.దాదాపు ఐదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన దీప్తి, షణ్ముఖ్.. ఇటీవలే లవ్ లైఫ్ కి బ్రేకప్ చెప్పి వార్తల్లో నిలిచారు. అయితే.. బ్రేకప్ జరిగి చాలా రోజులు అయిపోయింది. కానీ బ్రేకప్ తర్వాత వీరిద్దరూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు మాత్రం ప్రతిసారి చర్చలకు దారితీస్తున్నాయి. షన్నుతో బ్రేకప్ తర్వాత దీప్తి తనకు తానుగా హ్యాపీగా గడిపేస్తూ.. బ్రేకప్ మోడ్ లో నుండి బయటపడేందుకు ట్రై చేస్తుంది.
తాజాగా దీప్తి పెట్టిన మరో పోస్టు వైరల్ అవుతోంది. “హ్యాపీగా ఉండటం అనేది మన బాధ్యత.. వేరెవరు మన హ్యాపినెస్ ని ఫుల్ ఫిల్ చేయలేరు” అంటూ చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ పై షణ్ముఖ్ లేకుండా దీప్తి హ్యాపీగానే ఉన్నట్లు పరోక్షంగా చెబుతోందని నెటిజన్లు అంటున్నారు. ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఈ కొత్త పోస్ట్ లో దీప్తి ఎడమ భుజంపై ఓ టాటూ కూడా వేసుకుంది. మరి ప్రస్తుతం దీప్తి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి దీప్తి పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.