డిప్రెషన్.. మానసిక కుంగుబాటు.. మనిషిని అతలాకుతలం చేస్తుంది. అసలు మనకు ఏం జరుగుతుందో మనకే అర్థం కాదు.. ఒకటే దిగులు, వేదన. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు.. ఇలాంటి పరిస్థితుల్లోనే కొందరు ఆత్మహత్య వంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. తాను కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాను అంటున్నారు హీరోయిన్ ఇలియానా. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టారు. కానీ తెలుగులో వచ్చినంత క్రేజ్ అక్కడ రాలేదు. ఆ తర్వాత క్రమంగా సినిమాలకు దూరం అయ్యారు.
ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికి.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటారు ఇలియానా. ఈ క్రమంలో కొన్ని రోజులు క్రితం ఓ ఇంటర్వ్యూలో ఇలియానా.. తాను బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నానని.. ఎన్నో అవమానాలు సహించానని తెలిపారు. ఈ క్రమంలో బాడీ షేమింగ్ వల్ల ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలని భావించిందంటా అనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఇలియానా స్పందించారు.
ఇది కూడా చదవండి: ఘనంగా అలియా – రణబీర్ పెళ్లి.. ఫోటోస్ వైరల్!
ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై ఇలియానా స్పందిస్తూ.. ‘‘అవును నేను గతంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన మాట నిజమే. కానీ బాడీ షేమింగ్ వల్ల కాదు. 12వ ఏట నుంచే నాకు శరీర సమస్యలు ప్రారంభం అయ్యాయి. ఆ సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉంటూ వచ్చాను. ఇక ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడానికి నా శరీరాకృతి కారణం కాదు. అప్పట్లో నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లాను. అందుకే ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాకను. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితులు సాయంతో.. ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాను’’ అని చెప్పుకొచ్చారు ఇలియానా.
ఇది కూడా చదవండి: పెట్రోల్ బంకు బంపరాఫర్.. రూపాయికే లీటర్ పెట్రోల్!
‘‘కానీ మీడియాలో మాత్రం.. బాడీ షేమింగ్, బాడీ డిస్మోర్ఫిక్ అంశాలతోనే ఆత్మహత్య ఆలోచన చేసినట్టు ప్రచారం చేస్తున్నారు. ఆ ఆర్టికల్ చూసి చాలామంది నాకు సందేశాలు పంపడం ప్రారంభించారు. అవన్నీ చూసి నాకు చాలా చిరాకు కలిగింది’’ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది ఇలియానా. ఈ భామ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రియమైన భర్తకు.. తర్వలో మన జీవితాల్లో మార్పులు రాబోతున్నాయ్: కాజల్