ఇండియన్ సినీ అభిమానులకు ఐ-బొమ్మ(iBOMMA) మూవీ సైట్ చేదువార్త చెప్పింది. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ని కంగారు పెడుతున్న ఐ బొమ్మ.. ఈసారి ఏకంగా అసలుకే ఎసరు పెట్టేసింది. ఇండియాలో తమ సేవలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఓటిటి సినిమాలను ఐబొమ్మ సైట్ లో ఫాలో అయ్యే యూజర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎంతోకాలంగా ఐబొమ్మ సైట్ థియేటర్లలో, ఓటిటిలో సినిమాలు చూడలేని వారికి హై క్వాలిటీ సినిమాలు డౌన్ లోడ్ చేసుకుని చూసే అవకాశాన్ని కల్పిస్తూ వచ్చింది.
ఇక కొద్దిరోజుల కిందటే ఇండియాలో శాశ్వతంగా సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించిన ఐబొమ్మ.. యూజర్స్ రిక్వెస్ట్ మేరకు తిరిగి సేవలు ప్రారంభించింది. అయితే.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి యూజర్స్ దయచేసి మళ్లీ సేవల కోసం రిక్వెస్ట్ చేయొద్దని తేల్చిచెప్పేసినట్లు తెలుస్తుంది. ఐబొమ్మ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి సినీ అభిమానులు ఈ సైట్ నే ఫాలో అవుతూ.. తమకు నచ్చిన సినిమాలను చూస్తున్నారు. ఇకపై అలాంటి అవకాశం ఉండదని సూటిగా చెప్పేసింది. ఇటీవలే సినిమాల డౌన్ లోడ్ ఆప్షన్ ని తొలగించింది ఐబొమ్మ.
ఈ క్రమంలో సరే సినిమాలు డౌన్ లోడ్ కాకపోయినా, కనీసం చూసే వీలుంది కదా అని హ్యాపీ అయ్యారు ఫ్యాన్స్. కానీ.. ఇంతలోనే ఇండియాలో ఇకపై మా సేవలు కొనసాగించబోము. సెప్టెంబర్ 9 నుండి ఐబొమ్మ సేవలు ఇండియాలో శాశ్వతంగా నిలిపివేస్తున్నామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ చేదువార్త తెలిసిన యూజర్స్ అంతా నిరాశకు లోనవుతున్నారు. ఇదిలా ఉండగా.. తమ సైట్ గురించి దుష్ప్రచారం చేయడం వల్లే షట్ డౌన్ చేసే నిర్ణయం తీసుకున్నామని గతంలో నిర్వాహకులు అన్నారు. ఇప్పుడు నిజంగానే చేసి చూపించబోతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఐబొమ్మ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Rey thalapathy ekkada ra
IBOMMA users🥺😤 pic.twitter.com/DiLGvBs5Hs— VK (@VinayKiccha_) September 5, 2022
ఐబొమ్మలో ఇకపై బొమ్మ పడదు
ప్రేక్షకులకు హై క్వాలిటీలో ఉచితంగా కొత్త సినిమాలను చూపిస్తున్న ఐబొమ్మ వెబ్ సైట్ భారతదేశంలో తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.#ibomma
— 𝘕𝘢𝘳𝘦𝘴𝘩 𝘗𝘦𝘥𝘪𝘳𝘦𝘥𝘥𝘪 (@NareshPedireddi) September 5, 2022
Global Users:
iBOMMA is no longer only for Telugu audience pic.twitter.com/4ytQ0J7iT2
— iBOMMA OFFICIAL (@ibomma_official) September 4, 2022