ఆమె యంగ్ హీరోయిన్. ఒకేఒక్క పాటతో ఫుల్ పాపులారిటీ అందుకుంది. నటిగా ఆకట్టుకుంటున్నప్పటికీ ఛాన్సులే సరిగా రావట్లేదు. ఆమె ఎవరో గుర్తొచ్చిందా?
హీరోయిన్లు సినిమాల్లో నటిస్తారు. కానీ అవి హిట్ అయితేనే వాళ్లకు పేరొస్తుంది. లేకపోతే మూవీ ఛాన్సులు పెద్దగా రావు. జనాలు కూడా మర్చిపోతారు. కొందరు బ్యూటీస్ ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంటారు. పైన కనిపిస్తున్న బ్యూటీ అలాంటిదే. తెలుగులో కొన్నాళ్ల ముందు వచ్చిన ఓ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా చేసింది. అందులో ఒకే ఒక్క పాట సూపర్ హిట్ అయింది. అలా ఈమె కూడా చాలా పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరి ఆమె ఎవరో కనిపెట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి స్వతహాగా డ్యాన్సర్. చిన్నప్పటి నుంచే స్కూల్, కాలేజీ కాంపిటీషన్స్ లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. పెద్దయిన తర్వాత హీరోయిన్ కావాలనుకుంది. అలానే అయింది. ఇప్పటివరకు ఆరు సినిమాలు చేస్తే, అవన్నీ కూడా తెలుగువే కావడం విశేషం. ఆ బ్యూటీ పేరు ప్రియా వడ్లమాని. ‘ప్రేమకు రెయిన్ చీక్’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంటరైన ఈ భామ.. గతేడాది వచ్చిన ‘ముఖచిత్రం’లోనూ హీరోయిన్ గా చేసి, నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఈమె పేరు చెబితే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు గానీ ‘హుషారు’ మూవీ బ్యూటీ అనగానే సులభంగా గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాలో ‘ఉండిపోరాదే’ అంటూ సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్ లో ఉండేది ఈమెనే. ముద్దు సన్నివేశాలకు ఏ మాత్రం వెనకాడకుండా రెచ్చిపోయిన ప్రియా వడ్లమాని.. ‘ఆవిరి’, ‘కాలేజ్ కుమార్’, ‘ముఖచిత్రం’ సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది. కానీ పేరయితే పెద్దగా రాలేదు. సో అదన్నమాట విషయం. మరి ‘హుషారు’ బ్యూటీని చిన్నప్పటి పిక్ చూసి ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.